Interesting Mumbai And Gujarat match: ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు దారిలో పడింది. ఓటముల నుంచి విజయాల బాట పట్టింది. ఇన్నాళ్లు వరుస అపజయాలతో పరువు తీసుకున్న ముంబై వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సత్తా చాటింది. తమకూ గెలిచే బలముందని నిరూపించింది. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటములే మూటగట్టుకుని విమర్శలు ఎదుర్కొన్నా ఎట్టకేలకు సక్సెస్ ల ఊపు తెచ్చుకుంది. రెండు మ్యాచుల్లో విజయదుందుబి మోగించి తమకు ఎదురులేదని చెబుతోంది.
శుక్రవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. ఐదు పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించింది. చివరి ఓవర్ లో తొమ్మిది పరుగులు రాబట్టుకుని తమ విజయయాత్ర కొనసాగించిది. అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించడంతో వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ ని స్వయంకృతాపరాధంతో గుజరాత్ చేజార్చుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Babu Gogineni: విశ్వక్ సేన్ మరియు దేవి నాగవల్లి వివాదం గురించి బాబు గోగినేని సెన్సషనల్ కామెంట్స్
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 43, ఇషాన్ కిషన్ 45, టీమ్ డేవిడ్ 44 రాణించారు. రషీద్ ఖాన్ రెండ, అల్దారీ జోసెఫ్, లాకీ ఫెగ్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ తీశారు. తరువాత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 173 పరుగులు చేసి పరాజయం పాలైంది.
వృద్ధిమాన్ సాహా (40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55) శుబ్ మన్ గిల్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 52) అర్థ శతకాలతో సత్తా చాటినా ముంబై చేతిలో ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో మురుగన్అశ్విన్ రెండు, పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రనౌట్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. అపజయానికి దగ్గర చేసింది. దీంతో ముంబై ఇండియన్ ను మరో విజయం వశమైంది. ఎట్టకేలకు రెండు మ్యాచుల్లో విజయం సాధించినా గత మ్యాచుల్లో అపజయాలు మాత్రం జట్టును వెంటాడాయి. ప్రస్తుతం ముంబై తన పరువు మాత్రం నిలబెట్టుకుంది.
Also Read: AP Employees: ఏపీలో ఉద్యోగుల సమస్యలు తీర్చరా?