Women T20 World Cup: టీ -20 మహిళా వరల్డ్ కప్ లో ఆసక్తికర సంగతులివి.. ఆయా జట్ల ప్లేయర్ల వ్యక్తిగత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

యూఏఈ వేదిక జరుగుతున్న మహిళా టి20 వరల్డ్ కప్.. ఆసక్తికరంగా సాగుతోంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న టీమిండియా తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 58 పరుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే అన్ని మ్యాచ్ లు టీమిండియా గెలవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో మహిళా టీ -20 వరల్డ్ కప్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే

Written By: Bhaskar, Updated On : October 6, 2024 3:30 pm

Women T20 World Cup

Follow us on

Women T20 World Cup: ఆస్ట్రేలియా జట్టు టి20 వరల్డ్ కప్ లో అత్యధికంగా టోర్నీలు సాధించిన టీమ్ గా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆరు టైటిల్స్ సొంతం చేసుకుంది. 44 మ్యాచ్ లు ఆడి 35 మ్యాచ్ లలో గెలిచింది. హైయెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ ఆస్ట్రేలియా పేరు మీద ఉంది.

పాక్ జట్టు 32 మ్యాచులు ఆడి 23 మ్యాచ్ లలో పరాజయాలు చవిచూసింది. అత్యంత పరాజయాలు చూసిన జట్టుగా పాకిస్తాన్ రికార్డు సృష్టించింది.

పాకిస్తాన్ జట్టుపై ఫిబ్రవరి 21 2023న ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 213 రన్స్ చేసింది. టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే హైయెస్ట్ స్కోర్.

ఇక 2018 నవంబర్ 9న గయానా వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 14.4 ఓవర్లలో 46 పరుగులకు కుప్ప కూలింది. టి20 చరిత్రలో ఇదే లో- స్కోర్.

2023 ఫిబ్రవరి 21న కేప్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్టుపై 114 రన్స్ తేడాతో ఓడించింది. టి20 వరల్డ్ కప్ లో పరుగులపరంగా ఇదే అతిపెద్ద విజయం.

2012 సెప్టెంబర్ 30న గాలే వేదికగా దక్షిణాఫ్రికా పై వెస్టిండీస్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీ -20 వరల్డ్ కప్ లో వికెట్ల పరంగా అతి పెద్ద గెలుపు.

2012 అక్టోబర్ 1న గాలే లో పాకిస్తాన్ జట్టు ఒక్క పరుగు తేడాతో భారత్ ను ఓడించింది. పరుగులపరంగా ఇదే అతి చిన్న విజయం.

ఇక వికెట్ల పరంగా 2016 మార్చి 24 ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ పై ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది..

న్యూజిలాండ్ ప్లేయర్ పేరు మీద..

న్యూజిలాండ్ జట్టుకు చెందిన సుజీ బేట్స్ పేరు మ్యాచులలో 1,066 రన్స్ చేసింది.. ఇప్పటివరకు ఈమె హైయెస్ట్ స్కోర్ సాధించిన ప్లేయర్ గా కొనసాగుతోంది.

2014 మార్చి 27 సిల్హెట్ వేదికగా ఐలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్లేయర్ మెక్ లానింగ్ 65 బంతుల్లో 126 రన్స్ చేసింది.

ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ 43.42 తో (23 మ్యాచ్ లలో 608 రన్స్ చేసింది) తో ఎక్కువ సగటు కలిగి ఉన్న ప్లేయర్ గా కొనసాగుతోంది.

ఆస్ట్రేలియా చెందిన అలిస్సా హీలి 128.37 తో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న ప్లేయర్ గా నిలిచింది..

మెక్ లానింగ్ – ఆస్ట్రేలియా, డియాండ్రా డాటిన్ – వెస్టిండీస్, హీథర్ నైట్ – ఇంగ్లాండ్, హర్మన్ ప్రీత్ కౌర్ – భారత్, మునీబా అలీ – పాకిస్తాన్, లిజెల్ లీ – దక్షిణాఫ్రికా.. అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్లుగా కొనసాగుతున్నారు.

న్యూజిలాండ్ జట్టుకు చెందిన సుజి బే ట్స్ 36 మ్యాచ్లలో 8 హాఫ్ సెంచరీలు చేసి.. ఈ విభాగంలో టాప్ స్థానంలో కొనసాగుతోంది.