Babar Azam Sports Bra: పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ వేసుకున్న స్పోర్ట్స్ బ్రా వెనుక ఎంత మేటర్ ఉందో తెలుసా?

బాబర్ వేసుకున్నది కేవలం నార్మల్ స్పోర్ట్స్ పర్సన్స్ వేసుకునే వెస్ట్ కాదు. అది చూడడానికి నార్మల్ వెస్ట్ లాగా కనిపించే ఒక స్పోర్ట్స్ బ్రా. క్రమేపి బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ స్పోర్ట్ బ్రా ను చాలా తక్కువ మంది ఆటగాళ్లు వేసుకుంటున్నారు.

Written By: Vadde, Updated On : July 29, 2023 1:41 pm

Babar Azam Sports Bra

Follow us on

Babar Azam Sports Bra: ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. బాబర్ అజామ్ సారథ్యంలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న ఈ జట్టు టెస్ట్ మ్యాచ్లో తన సత్తాను చాటుతూ ఆదిత్య జట్టును ఘోరంగా ఓడిస్తూ ముందుకు సాగుతుంది. జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంకపై పాక్ తన విజయాన్ని నమోదు చేసుకుంది. తర్వాత కొలంబో వేదికగా జరిగినటువంటి రెండవ టెస్ట్ మ్యాచ్లో ఇదే జోష్ కొనసాగిస్తూ 222 పరుగుల తేడాతో శ్రీలంక ను చిత్తు చేసింది పాక్ టీమ్.

ఈ విజయంతో పాక్ జట్టు లంకపై అత్యధిక సిరీస్ సొంతం చేసుకున్న టీం గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ విషయం కంటే కూడా బాబర్ చేసిన పని కేవలం పాకిస్తాన్ అభిమానులే కాకుండా యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. గెలిచిన తర్వాత పెవీలియన్ వైపు వెళ్తున్న అతన్ని ఒక శ్రీలంక యువ అభిమాని మీ జెర్సీ నాకు బాగా నచ్చింది…అని అడిగిన వెంటనే దానికి స్పందించిన బాగా తాను వేసుకున్న జెర్సీని అక్కడికక్కడే తీసి అభిమానికి అందించాడు.

అయితే ఈ మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చేసిన ఈ పని అక్కడి ఉన్న అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత బాబర్ ఒక అభిమానికి తాను వేసుకున్న జెర్సీ ని తీసి కానుకగా అందించాడు. అది అందుకున్న అభిమాని ఖుష్ అవుతుంటే…జెర్సీ తీసిన తర్వాత బాబర్ వంటిపై ఉన్న వెస్ట్ చూసి మిగిలిన అందరూ స్టన్ అయ్యారు. ఇంతకీ అవాక్కవ్వాల్సినంత సీన్ ఆ వెస్ట్ లో ఏముంది అని ఆలోచిస్తున్నారా…

బాబర్ వేసుకున్నది కేవలం నార్మల్ స్పోర్ట్స్ పర్సన్స్ వేసుకునే వెస్ట్ కాదు. అది చూడడానికి నార్మల్ వెస్ట్ లాగా కనిపించే ఒక స్పోర్ట్స్ బ్రా. క్రమేపి బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ స్పోర్ట్ బ్రా ను చాలా తక్కువ మంది ఆటగాళ్లు వేసుకుంటున్నారు. నిజానికి దీన్ని స్పోర్ట్స్ బ్రా అనడం అంటే కూడా ఒక టెక్నాలజీ కాస్ట్యూమ్ అనడం కరెక్ట్ గా ఉంటుంది.

దీన్ని ఒక కంప్రెషన్ వెస్ట్ అని కూడా పిలుస్తారు.. ఎందుకంటే ఇది భుజాల మధ్య మరియు వీపు వెనక భాగాన్ని ఫిట్గా ఉంచడం కోసం సహాయపడుతుంది. ఎంతో తేలికగా ఉండే ఈ వెస్ట్ శరీరానికి చాలా లైట్ ఫీలింగ్ ఇచ్చి కంఫర్టబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఒక జిపిఎస్ ట్రాకర్ కూడా ఉంటుంది. ప్లేయర్ తన రన్నింగ్ స్పీడ్ డిటెక్ట్ చేయడం కోసం ఈ జిపిఎస్ ట్రాకర్ని వాడుతారు.

ఇందులో అమర్చబడినటువంటి గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ప్లేయర్ ప్రతి కదలికలని 3d రేంజ్ లో మెషర్ చేయడమే కాకుండా వారు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తుంది. ఇది వాళ్ళ హార్ట్ బీట్ ని కూడా మానిటర్ చేయడంలో యూస్ అవుతుంది. ఈ జిపిఎస్ ట్రాకర్ నుంచి వెలువడుతున్న సమాచారాన్ని సెంట్రల్ డేటా బేస్‌కు అనుసంధానించడం జరుగుతుంది. ప్లేయర్ యొక్క ఫిట్నెస్ను పరిశీలించి విశ్లేషించడానికి ఈ డేటా ని ఉపయోగించుతారు.

2018లో ఇండియన్ క్రికెట్ టీం కండిషనింగ్ కోచ్ శంకర్ బస్సు దీనిని టీం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటినుంచి మన ఆటగాళ్లు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. ఇటువంటి వెస్ట్ వేసుకోవడం వల్ల ప్లేయర్స్ యొక్క కదలికలపై కోచ్ కి పూర్తి అవగాహన ఉంటుంది. అవసరమైనప్పుడు ఎంతవరకు శక్తిని ఉపయోగించవచ్చు అన్న దానిపై కోచ్ కి ఒక ఐడియా ఉంటుంది. క్రికెట్ ప్లేయర్లు రిహబ్ సమయంలో ఈ డేటా ఎంతో యూస్ అవుతుంది.