Nargis Fakhri: అమెరికాలో పుట్టిన నర్గిస్ ఫక్రి మోడలింగ్ చేశారు. బాలీవుడ్ చిత్రాలతో హీరోయిన్ అయ్యారు. 2011లో వచ్చిన రాక్ స్టార్ ఆమె డెబ్యూ మూవీ. రన్బీర్ కపూర్ హీరోగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ముఖ్యంగా నర్గీస్ ఫక్రి నటన, గ్లామర్ యువతను ఊపేశారు. నర్గీస్ హిందీ పరిశ్రమను ఏలడం ఖాయం అనుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు ఎదగడం అంత సులభం కాదు. కారణాలు ఏమైనా నర్గీస్ స్టార్ కాలేకపోయింది.
మద్రాస్ కేఫ్, పటా పోస్టర్ నికలా హీరో, కిక్, స్పై, హౌస్ ఫుల్ 3 వంటి హిట్ చిత్రాల్లో నటించింది. హరి హర వీరమల్లు మూవీతో తెలుగులో అడుగుపెడుతుంది. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లులో నర్గీస్ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె పాత్ర రోషనార బేగం అని సమాచారం. హరి హర వీరమల్లు చిత్రీకరణ దశలో ఉంది. అనుకోని కారణాలతో షూటింగ్ ముందుకు సాగడం లేదు.
ఇదిలా ఉంటే నర్గీస్ ఫక్రి తనకు ఎదురైన ఓ భయంకర అనుభవం అభిమానులతో పంచుకున్నారు. నర్గీస్ కి ఇండియాలో తెలిసినవాళ్ళు ఎవరూ లేరు. దాంతో ముంబై బాంద్రాలోని హిల్ రోల్ ఏరియాలో ఉండేవారట. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ పక్కనే ఒక స్మశానం ఉండేదట. ప్రతిరోజూ రాత్రి ఆమెను ఒక పీడకల వెంటాడిందట.
ఓ వ్యక్తి వచ్చి ఆమెను స్మశానానికి తీసుకెళ్లేవాడట. అక్కడ అస్థిపంజరాలు, ఎముకలను తినమని బలవంతం చేసేవాడట. ప్రతిరోజూ తనకు ఈ కల వచ్చేదట. భయంతో తెల్లవారుజామున లేచేదట. రోజూ పీడకల వెంటాడుతున్న క్రమంలో నర్గీస్ ఏకంగా ముంబై వదిలేసిందట. ఢిల్లీ వెళ్ళిపోయాక ఆమెకు పీడకలలు రాలేదట. తాను ఖాళీ చేసిన ముంబై అపార్ట్మెంట్ లో చనిపోయిన పక్షి పిల్లలు కనిపించాయని వర్కర్స్ చెప్పారట. నర్గీస్ ఓ సందర్భంలో ఈ విషయాలు వెల్లడించారు.