https://oktelugu.com/

Bapu Nadkarni: బుమ్రా వల్ల కాదు.. హర్షిత్ రాణా అందుకోలేడు.. ఇతడు సృష్టించిన రికార్డు అటువంటిది మరి..

టీమిండియాలో బుమ్రా ఓ సంచలనం. హర్షిత్ రాణా ఓ యువ కెరటం. వీరందరి కంటే ముందు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు అత్యద్భుతం. అయితే వీరందరికీ సాధ్యం కాని రికార్డును టీమ్ ఇండియా క్రికెటర్ నెలకొల్పాడు. సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించి శిఖరాగ్రాన నిలిచాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 2, 2024 / 11:52 AM IST

    Bapu Nadkarni

    Follow us on

    Bapu Nadkarni: టీమిండియాలో 1960 కాలంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బాపు నాదకర్ణి సంచలనమైన బౌలింగ్ తో అదరగొట్టేవాడు.. తనదైన మెలితిప్పే బంతులు వేస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు. నాడు బాపు బౌలింగ్ అంటే బ్యాటర్లు వణికి పోయేవారు. ఒకవేళ క్రికెట్లు తీకపోయినా మెయిడ్ ఇన్ ఓవర్లు వేస్తూ ఆకట్టుకునేవాడు.. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇంగ్లాండ్ జట్టుపై 21 ఓవర్లు మెయిడ్ ఇన్ గా వేశాడు. ఇప్పటివరకు క్రికెట్లో ఇది ఒక అద్భుతమైన రికార్డుగా ఉంది. మరే బౌలర్ సాధించాలని ఘనతగా నిలిచింది. 1964లో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్ లో బాపు 21 ఓవర్లు మెయిడ్ ఇన్ గా వేశాడు. అతడు వేసిన బంతులను కాచుకోవడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. క్రీజ్ లో నిలబడితే చాలురా దేవుడా అనుకున్నట్టుగా ఉన్నారు.. ఈ మ్యాచ్లో మొత్తం బాపు 32 ఓవర్లు వేశాడు. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అతడి రికార్డును ఇంతవరకు ఏ బౌలర్ కూడా అధిగమించలేకపోయాడు.

    ఎంతోమంది బౌలర్లు వచ్చినా…

    బాపు తర్వాత స్పిన్ విభాగంలో భారత జట్టులోకి అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్ బౌలర్లు వచ్చినప్పటికీ.. బాపు రికార్డును అధిగమించలేకపోయారు.. ఇక ప్రపంచంలో ఇతర జట్ల బౌలర్లను చూసుకున్నా ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయారు. అయితే ఇటీవల వెస్టిండీస్ బౌలర్ జడెన్ సీల్స్ వరుసగా ఆరు ఓవర్లు మెయిడ్ ఇన్ గా వేశాడు. బాబు మాత్రం ఏకంగా 21 ఓవర్లు మెయిడ్ ఇన్ గా సంధించాడు. ” నాటి రోజుల్లో అవుట్ ఫీల్డ్ లు అంతంతమాత్రంగానే ఉండేవి. ఇప్పుడు ఉన్నట్టుగా పచ్చిక ఉండకపోయేది.. పైగా తెలుపు బంతులు మాత్రమే ఉండేవి.. అలాంటి స్థితిలో బాపు బంతిని మెలి తిప్పడం మాత్రమే కాదు.. ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా కట్టడు చేశాడు. ప్రస్తుత రోజుల్లో బాపు కనుక బౌలింగ్ చేస్తే మాత్రం.. ఎంతటి తోపు బ్యాటర్లైనా సరే అలా ఉండిపోయేవారని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

    బౌలింగ్ లో వైవిధ్యం

    బాపు బౌలింగ్లో వైవిధ్యం ఉండేది. తనకు మాత్రమే సాధ్యమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ అతడు వేసేవాడు. బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇచ్చేవాడు కాదు. నిర్జీవమైన మైదానంపై కూడా అతడు స్పిన్ రాబట్టేవాడు. బంతిని ముని వేళ్ళల్లో మెలి తిప్పుతూ చుక్కలు చూపించేవాడు. దీంతో బ్యాటర్లు తమ వికెట్లను కాపాడుకోవడం పైనే దృష్టి సారించేవారు. పొరపాటున కూడా రన్స్ కొట్టడానికి ప్రయత్నించేవారు కాదు. అందువల్లే బాపు టీమిండియాలో సంచలన బౌలర్ గా నాడు రికార్డులు సృష్టించాడు.