WTC Final 2025 : టెస్ట్ క్రికెట్ లో మొన్నటిదాకా సౌత్ ఆఫ్రికా దారుణమైన ఆట ప్రదర్శించేది. అయితే ఇప్పుడు స్వదేశంలో శ్రీలంకలో జరుగుతున్న సిరీస్లో తన ఆట తీరును పూర్తిగా మార్చుకుంది. అసాధారణమైన ఆటతీరితో శ్రీలంకతో సిరీస్ విజయాన్ని దక్కించుకుంది. 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసుకుంది. సోమవారం ముగిసిన రెండో టెస్టులో శ్రీలంకపై సౌత్ ఆఫ్రికా 109 రన్స్ తేడాతో విజయం సాధించింది. శ్రీలంక ఎదుట సౌత్ ఆఫ్రికా 348 రన్స్ టార్గెట్ విధించింది. శ్రీలంక జట్టు విజయానికి 109 పరుగుల దూరంలో నిలిచింది. కేశవ్ మహారాజ్ 5/76 తో చెలరేగి శ్రీలంక జట్టుకు చుక్కలు చూపించాడు. రబాడా, డెన్ పీటర్సన్ చెరి రెండు వికెట్లు దక్కించుకున్నారు. మార్కో జాన్సెన్ ఒక వికెట్ పడగొట్టాడు. శ్రీలంక ఆటగాళ్లలో ధనుంజయ డిసిల్వా (50) హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. కుశాల్ మెండిస్ (46) మెరుగ్గా ఆడాడు. సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 358 రన్స్ చేసింది. శ్రీలంక 328 రన్స్ చేసింది. సౌత్ ఆఫ్రికా రెండవ ఇన్నింగ్స్ లో 317 రన్స్ చేసి.. మొత్తంగా 348 రన్స్ టార్గెట్ ను శ్రీలంక ఎదుట ఉంచింది..
అవకాశాలు మెరుగు
ఈ మ్యాచ్ లో గెలిచి సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ బెర్త్ అవకాశాలను సుస్థిరం చేసుకుంది. ఈ విజయం ద్వారా పాయింట్ల టేబుల్ లో ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా వెనక్కి నెట్టింది. ఏకంగా తొలి స్థానాన్ని అందుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2023-25 సైకిల్లో 10 మ్యాచ్ లు ఆడింది. ఆరు విజయాలు సొంతం చేసుకుంది. 63.33 విజయాల శాతంతో తొలి స్థానంలో ఉంది.. ఈ సైకిల్ లో సౌత్ ఆఫ్రికా మరో సిరీస్ ఆడాల్సి ఉంది. పాకిస్తాన్ జట్టుతో స్వదేశంలో డిసెంబర్ 26 నుంచి సౌత్ ఆఫ్రికా రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందులో ఒక మ్యాచ్ గెలిస్తే చాలు సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఫైనల్ లోకి వెళ్తుంది..
టీమిండియా అవకాశాలు సంక్లిష్టం
సౌత్ ఆఫ్రికా శ్రీలంకతో టెస్ట్ సిరీస్ విజయం సాధించడంతో.. టీమిండియా WTC అవకాశాలు అత్యంత ప్రమాదంలో పడ్డాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా 60.71 విజయాల శాతంతో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. టీమిండియా 57.29 విజయాల శాతంతో మూడో స్థానంలో ఉంది. ఒకవేళ భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో చేరాలంటే ఆస్ట్రేలియా తో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన మూడు మ్యాచ్ లలో ఘన విజయం సాధించాలి. అప్పుడే ఎటువంటి లెక్కలు లేకుండా టీమిండియా ఫైనల్ వెళ్తుంది. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా టీమిండియా కు ఇబ్బంది తప్పదు. ఒకవేళ సిరీస్ ను 3-2 తేడాతో గెలిస్తే.. అప్పుడు ఆస్ట్రేలియా – శ్రీలంక తలపడే టెస్ట్ సిరీస్ ఫలితం పై భారత్ ఆధార పడాల్సి ఉంటుంది. భారత్ కచ్చితంగా ఫైనల్ వెళ్లాలంటే శ్రీలంక టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో గెలవాలి. శ్రీలంకపై ఘన విజయం సాధించిన తర్వాత సౌత్ ఆఫ్రికా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. రెండవ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతోంది.
INDIA’S WTC FINAL SCENARIO
Win BGT 4-1 or 3-1 – India qualifies.
Win BGT 3-2 – India qualifies if SL beat Aus in one of two Tests.
If BGT 2-2 – India qualifies if SL beat Aus 2-0.
If India lose BGT 2-3 – India qualifies if Pak beat SA 2-0 & Aus beat SL in one of two Tests. pic.twitter.com/WQsAbn848m
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 9, 2024