Veera Dheera Sooran’ movie teaser : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో చియాన్ విక్రమ్…ఈయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రీసెంట్ గా ‘తంగలాన్ ‘ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన ఇప్పుడు ‘వీర ధీర శురాన్’ అనే పేరుతో ఒక సినిమా చేస్తున్నాడు. హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద రియా శిబు నిర్మిస్తున్న ఈ సినిమాని ఎస్ యు అరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి కొద్దిసేపటి క్రితమే టీజర్ రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్ మొత్తం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కిరాణా కొట్టు దగ్గరికి ఒక మహిళ వచ్చి తనకది కావాలని అరుస్తుంటే డిస్టర్బ్ అవుతుంది అన్నట్టుగా ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. దాంతో ఆమె సైలెంట్ అవుతుంది. అప్పటినుంచి యాక్షన్ సీక్వెన్స్ ను ఎలివేట్ చేస్తూ ఈ టీజర్ కట్ అయితే ఇచ్చారు. ఇక ఇంతకు ముందు సినిమాల్లో విక్రమ్ చేసిన క్యారెక్టర్ కంటే కూడా ఈ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
యాక్షన్ రొమాన్స్ మిక్స్ చేసి ఈ సినిమాని తీసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఎస్ జే సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి నటించి మెప్పించడానికి మన ముందుకు రాబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారం సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఎస్ జే సూర్య చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు.
ఇక ఆ సినిమా సక్సెస్ లో ఆయన కీలక పాత్ర వహించాడనే చెప్పాలి. మరి ఇప్పుడు ఈ సినిమాలో కూడా తను ఒక పవర్ ఫుల్ పాత్రలో మనకు కనిపించబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ద్వారా విక్రమ్ కి మరొక మంచి విజయం అయితే దక్కబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ టీజర్ ని చాలా అద్భుతంగా కట్ చేశారు. ముఖ్యంగా ఈ టీజర్ మొత్తం చాలా కొత్తగా ఉండడమే కాకుండా చాలా ఫ్రెష్ ఫీల్ అయితే ఇచ్చింది. ఇక ఇంతకుముందు చూసిన సినిమాలకంటే డిఫరెంట్ గా ఈ సినిమా ఉండబోతుందనే ఒక ఇంటెన్షన్ అయితే ప్రేక్షకుడిలో క్రియేట్ చేసిందనే చెప్పాలి…
ఇక జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మంచి ఫామ్ లో ఉన్నాడు. టీజర్ కి అందించిన మ్యూజిక్ ని బట్టి చూస్తే ఆయన అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చాడనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాని జనవరిలో తమిళ్,తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…