World Cup 2023 India Squad: భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనబోయే టీమ్ ఇండియా జట్టు విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఊహించినట్లుగానే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి అలవాటు పడ్డ సెలక్షన్ కమిటీ ఆడబోయే టీం విషయంలో పెద్దగా మార్పులు చేయలేదు. చూడ్డానికి జట్టు మెరుగుగా కనిపిస్తోంది కానీ ఆశించిన పర్ఫామెన్స్ ఇస్తారా లేదా అన్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది. సెలక్షన్ కమిటీ డిక్లేర్ చేసిన జట్టు వివరాలు క్రికెట్ అభిమానుల్లో పది రకాల అనుమానాలను రేపుతున్నాయి.
ముఖ్యంగా కొందరి ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా ఇదే ఫిట్నెస్ చూపించి వీళ్లు ప్రపంచ కప్ ఎంపికయ్యారా అన్న డౌట్ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ,శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ పై పలు రకాల అనుమానాలు కొనసాగుతున్నాయి. గాయాలకు శస్త్ర చికిత్సలు చేయించుకున్న ఈ ఇద్దరి ఆటగాళ్లు గత కొద్ది నెలలుగా జాతీయ క్రీకాట్ అకాడమీ లోని సమయం గడిపారు.
మరీ ముఖ్యంగా ఐపీఎల్లో రాహుల్ కి తీవ్ర గాయం అవ్వడమే కాకుండా కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఫిట్నెస్ సాధించి ఎంట్రీ ఇచ్చినట్టు చెబుతూనే మళ్లీ చిన్న గాయం అయింది కాబట్టి తొలి రెండు మ్యాచ్లలో ఆడడని చెబుతూ మరొక ట్విస్ట్ యాడ్ చేశారు. అతనికి బ్యాకప్ గా సంజు శాంసన్ను ఎంపిక చేశారు గట్టిగా ప్రపంచ కప్ కి నెలరోజులు కూడా లేని సమయంలో ఇలా మళ్లీ తిరిగి గాయాల పాలైన రాహుల్ ను మెగా టోర్నీకి ఎంపిక చేయడం కరెక్టేనా అన్న చర్చ నడుస్తుంది.
కోరుకున్నాము అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడి ఆట తీరు నిరూపించుకొని ప్లేయర్లను టోర్నీకి తీసుకోవడంపై పలు రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగని గాయానికి ముందు అతనేమన్నా పెద్ద ఫామ్ లో ఉన్నాడా అంటే అది లేదు. ఇలాంటి సమయంలో అణిచితంగా ఒక ఆటగాడిని టోర్నీలోకి తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కిలకమైన మ్యాచులకు ఇలాంటి ప్లేయర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు
ఇక శ్రేయస్ అయ్యర్ ఫామ్, ఫిట్నెస్ మీదా కూడా పలు రకాల సందేహాలు ఉన్నాయి. చాటింగ్ చేయడానికి అవకాశం వచ్చిన ఒక్క మ్యాచ్లో కూడా అతను పర్ఫామెన్స్ నిరూపించుకోలేకపోయాడు. మరొకక్క ఫీల్డింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రపంచకప్ లోపు వీళ్లిద్దరూ బ్యాటింగ్ మెరుగుపరచుకొని జట్టుకు ఉపయోగపడతారా అన్నది చూడాలి.
అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్,సూర్యకుమార్ యాదవ్…ఈ ముగ్గురి ఆటగాళ్ల పర్ఫామెన్స్ పై ప్రస్తుతం సర్వత్రా అవిశ్వాసం నెలకొంది.
చాలా రోజులుగా వివిధ ఫార్మాట్ లలో అక్షర్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అతని పర్ఫామెన్స్ అంతంత మాత్రమే. అప్పుడప్పుడు తన బ్యాట్ కి పని చేస్తున్నాడు కానీ బౌలింగ్లో పర్వాలేదనే చెప్పాలి. ఇక పేసర్ శార్దూల్ ఠాకూర్ వచ్చిన ఎన్నో అవకాశాలలో విఫలమయ్యాడు. మరి ఏం చూసి అతనికి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికి టీమిండియా జట్టుపై క్రికెట్ అభిమానుల్లో నిరాశ కనిపిస్తోంది.
Web Title: Indias team for the world cup with out of form players
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com