Jawan Advance Booking: బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన మునుపటి ఫామ్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు. షారుఖ్ గత సినిమా పఠాన్ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు సాధించి బాలీవుడ్ బాద్షా సత్తా ఏమిటో మరోసారి చూపించింది. దీనితో తాజాగా షారుఖ్ ఖాన్ నుంచి రాబోతున్న జవాన్ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 7 న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది ఈ సినిమా.
ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ హవా చూస్తుంటే మొదటి రోజు సరికొత్త రికార్డ్స్ నమోదు కావడం ఖాయమని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ గత సినిమా పఠాన్ తొలిరోజు ఇండియా వైడ్ గా 57 కోట్లు వసూళ్లు చేసింది. జవాన్ ఆ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం. ఇక అడ్వాన్స్ బుకింగ్ వివరాలు పరిశీలిస్తే ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరబాద్, కోల్‌కతా, చెన్నై నగరాల్లో భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి.
పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో 1,70,295 టికెట్లు, ఐనాక్స్ 1,15,218 టికెట్లు, సినీ పోలిస్ 57,120 టికెట్లు అమ్ముడుపోయాయి. ఢిల్లీ లో 60 వేల టికెట్స్, ముంబై లో 55 వేల టికెట్స్ , బెంగుళూరు లో 60 వేల టికెట్స్ , కోలకతా లో 50 వేల టికెట్స్ , చెన్నై లో 75 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. దీనితో ఇప్పటి వరకు ఇండియా లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దాదాపు 26 కోట్లు వరకు వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా దాదాపు 8. 5 లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయి.
దీనితో బాహుబలి 2, గదర్ 2, పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్స్ ను జవాన్ అధిగమించింది. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అవలీలగా మరో 1000 కోట్లు వసూళ్లు చేయడం ఖాయం. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార, దీపికా పదుకొనె, ప్రియమణి , విజయ్ సేతుపతి, యోగి బాబు లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సినిమాను గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.