https://oktelugu.com/

Team India: టీమిండియా ప్రక్షాళన.. కోహ్లీ ఔట్.. ఐపీఎల్ ఆటగాళ్లకు చాన్స్.. కొత్త కెప్టెన్.. వైస్ కెప్టెన్ వీరే

Team India: టీమిండియాను బీసీసీఐ ప్రక్షాళన చేసింది. ఐపీఎల్ లో రాణించిన యువకులకు పెద్దపీట వేసింది. ప్రపంచకప్ టీ20లో గ్రూప్ దశలోనే ఓడిన టీమిండియా ఘోర పరాభవంతో తిరిగి వచ్చిన బీసీసీఐ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో బీసీసీఐ మన భారత జట్టును పూర్తిగా టాలెంటెడ్ ఆటగాళ్లతో నింపేసింది. ప్రపంచకప్ ముగియగానే స్వదేశంలో టీమిండియా.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్, రెండు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలోనే కోహ్లీ వైదొలగడంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2021 8:37 pm
    Follow us on

    Team India: టీమిండియాను బీసీసీఐ ప్రక్షాళన చేసింది. ఐపీఎల్ లో రాణించిన యువకులకు పెద్దపీట వేసింది. ప్రపంచకప్ టీ20లో గ్రూప్ దశలోనే ఓడిన టీమిండియా ఘోర పరాభవంతో తిరిగి వచ్చిన బీసీసీఐ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో బీసీసీఐ మన భారత జట్టును పూర్తిగా టాలెంటెడ్ ఆటగాళ్లతో నింపేసింది.

    Rohit kl rahul

    Rohit kl rahul

    ప్రపంచకప్ ముగియగానే స్వదేశంలో టీమిండియా.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్, రెండు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలోనే కోహ్లీ వైదొలగడంతో టీమిండియా కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించింది. ఇక వైఎస్ కెప్టెన్ గా నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ ను చేసింది.

    ఈనెల 17 నుంచి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ జరుగనుంది. ఇందులో మూడు టీ20లు ఆడనున్నారు. టీ20ల్లో విరాట్ కోహ్లీ వారసుడిగా రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. కోహ్లీకి ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.

    ఇక ఐపీఎల్ లో బాగా రాణించిన ఆటగాళ్లకే టీమిండియాలో చోటు దక్కడం విశేషం. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రుతురాజ్ గైక్వైడ్, వెంకటేశ్ అయ్యర్, బౌలింగ్ లో అదరగొట్టి అత్యధిక వికెట్లు తీసిన హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, సిరాజ్, చాహల్ లను జట్టులోకి ఎంపిక చేయడం విశేషం.

    -న్యూజిలాండ్ తో సిరీస్ కు ఎంపికైన జట్టు ఇదే..
    రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వైడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్) ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.