
పుణె వేదికగా మంగళవారం ఇంగ్లండ్‌తో భారత్ తొలి వన్డేలో ఢీకొనబోతోంది. ఇందులో భాగంగా తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌ని 3–-2తో చేజిక్కించుకున్న టీమిండియా.. తొలి వన్డేలోనూ గెలిచి శుభారంభం చేయాలని ఆశిస్తోంది. మూడు వన్డేల ఈ సిరీస్ కోసం ఇప్పటికే 18 మందితో కూడిన భారత్ జట్టుని సెలెక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే.. తుది జట్టు విషయంలో మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో.. సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను ఆడించే సూచనలు కనిపిస్తుండగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగులో శ్రేయాస్ అయ్యర్ ఆడనున్నారు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండగా.. ఆరులో ఆడనున్న హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్‌ని పోషించనున్నాడు. ఇక బౌలింగ్ పరంగా భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, శార్ధూల్ ఠాకూర్ రూపంలో ముగ్గురు పేసర్లని తుది జట్టులోకి తీసుకోనున్న టీమిండియా.. స్పిన్నర్ల కోటాలో యుజ్వేందర్ చాహల్‌కి జోడీగా కృనాల్ పాండ్యా తీసుకునే అవకాశం ఉంది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కృనాల్ సొంతం. బౌలింగ్‌లో అవసరమైతే హార్దిక్ పాండ్యా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడు.
ఇంగ్లండ్‌తో తొలి వన్డేకి భారత్ తుది జట్టు అంచనా ప్రకారం ఇలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేందర్ చాహల్, టి.నటరాజన్.