https://oktelugu.com/

WTC Final 2023- Rohit Sharma: ఇన్ని ఓటములు నీవల్లే.. రోహిత్ రిటైర్మెంట్ తీసుకో

ఐసీసీ టోర్నీలు టీమిండియా కు కాల్చడం లేదని అభిమానులు మండిపడుతున్నారు. కొత్త కోచ్ వచ్చినప్పటికీ ఫలితం మారలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ప్రయోజనాల కోసం ఆడటంలేదని మండిపడుతున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : June 12, 2023 / 08:45 AM IST

    WTC Final 2023- Rohit Sharma

    Follow us on

    WTC Final 2023- Rohit Sharma: విజయం ఎంత కిక్ ఇస్తుందో.. అపజయం అంత బాధిస్తుంది. ప్రస్తుతం ఈ పరిస్థితిని ఇండియన్ క్రికెట్ అభిమానులు అనుభవిస్తున్నారు. అందుకే ఆగ్రహం తట్టుకోలేక హిట్ మాన్, భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పై విరుచుకుపడుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంపై ఒంటి కాలు మీద లేస్తున్నారు. చేతుల దాకా వచ్చిన కప్పును జారవిడిచావ్ అంటూ రోహిత్ శర్మ మీద అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రోహిత్ కెప్టెన్సీలో ఆసియా కప్, టి20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లు ఓడిపోయామని గుర్తు చేస్తున్నారు.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రిటైర్ అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

    పరిస్థితి మారలేదు

    ఐసీసీ టోర్నీలు టీమిండియా కు కాల్చడం లేదని అభిమానులు మండిపడుతున్నారు. కొత్త కోచ్ వచ్చినప్పటికీ ఫలితం మారలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ప్రయోజనాల కోసం ఆడటంలేదని మండిపడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా తొమ్మిది సార్లు ఐసిసి టైటిల్ చేజార్చుకోవడం ఇందుకు నిదర్శమని వారు గుర్తు చేస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీలో చిరస్మరణీయ విజయాల కంటే దారుణమైన ఓటములను జట్టు మూటగట్టుకుందని వారు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. ఎప్పుడో దశాబ్దం కాలం చివరిగా ఐసీసీ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా.. మళ్లీ ఛాంపియన్ గా నిలవలేకపోయిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.” 2013లో మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక మెగా టోర్నీ కూడా గెలవలేకపోయింది. ఇది అత్యంత బాధాకరం” అని అభిమానులు పోస్ట్ లు తున్నారు.

    ఇంత ఓటమా

    ఆస్ట్రేలియాలో జరిగిన డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 209 పరుగులు తేడాతో ఓడిపోవడాన్ని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. 444 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలడం పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ ఇంకా మెరుగైన ఇన్నింగ్స్ ఆడి ఉంటే భారత్ మ్యాచ్ ను శాసించేదని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో వారి సొంత మైదానంలో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఆగ్రహాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ మీద చూపిస్తున్నారు. ఇలా అయితే టీమిండియా టెస్ట్ భవితవ్యం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.