https://oktelugu.com/

IND vs NED : ఇండియా నెదర్లాండ్స్ మ్యాచ్ లో భారీ మార్పులు చేయనున్న ఇండియన్ టీమ్…ఆ ఇద్దరు ఔట్…

అయితే ప్రసిద్ది కృష్ణ టీమ్ లోకి వస్తే మహమ్మద్ సిరాజ్ బెంచ్ కి పరిమితం అవ్వాల్సి ఉంటుంది...ప్రసిద్ది కృష్ణ టీమ్ లో ఉంటాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2023 / 09:13 PM IST
    Follow us on

    IND vs NED : 2023 వరల్డ్ కప్ లో భాగం గా ఇండియన్ టీమ్ వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇలాంటి క్రమం లో ఇండియన్ టీమ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది.ఇక సెమీస్ లో ఇండియాతో తలపడే టీమ్ ఏది అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్రా అసక్తి నెలకొంది.ఇక ఇందులో భాగంగా ఇప్పుడు ఇండియన్ టీమ్ తన చివరి లీగ్ మ్యాచ్ ని నెదర్లాండ్స్ టీమ్ తో ఆడబోతుంది.

    ఇక ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ లో భారీ మార్పులు అయితే చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…ఇక అందులో భాగంగానే ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ లో గెలిచి సక్సెస్ తోనే లీగ్ ముగించి సక్సెస్ తోనే సెమీస్ లోకి అడుగుపెట్టాలని చూస్తుంది…అందుకే నెదర్లాండ్స్ తో మ్యాచ్ కూడా గెలిచి రికార్డ్ కొట్టాలని చూస్తుంది…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ లో నుంచి ఇద్దరు ప్లేయర్ లను పక్కన పెట్టేసి వాళ్ళ స్థానం లో ఇంతకు ముందు మ్యాచ్ ల్లో బెంచ్ కి పరిమితం అయిన ప్లేయర్ లను తీసుకోవాలని చూస్తున్నారు.వాళ్ళు ఎవరు అంటే సూర్య కుమార్ యాదవ్ ప్లేస్ లో శార్దూల్ ఠాకూర్ ని తీసుకోవాలని చూస్తున్నారు…ఇక అలాగే శ్రేయాస్ అయ్యర్ కి రెస్ట్ ఇచ్చి ఆయన ప్లేస్ లో ఇషాన్ కిషన్ ని తీసుకోవాలని చూస్తున్నారు…శ్రేయాస్ అయ్యారు గత మ్యాచ్ లో అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ వీళ్లని ఆడించి తనకి రెస్ట్ ఇస్తే బాగుంటుందని టీమ్ యాజమాన్యం భావిస్తుంది…

    ఇషాన్ కిషన్ , శార్ధుల్ ఠాకూర్ వీళ్ళకి ఈ టోర్నీ లో పెద్దగా మ్యాచ్ లు ఆడే ఛాన్స్ లు రావడం లేదు. కాబట్టి వీళ్ళు బెంచ్ కే పరిమితం అవుతున్నారు… అందుకే ఈ మ్యాచ్ లో ఓడిన గెలిచిన పెద్ద గా పోయేదేమీ లేదు కాబట్టి వాళ్ల ని టీమ్ లోకి తీసుకున్నట్టు గా తెలుస్తుంది…నిజానికి వీళ్లిద్దరూ మంచి ప్లేయర్లు టీమ్ కి అవసరం అయిన సమయంలో మంచి విజయాలు అందించడం లో వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు…

    ఇక దానికి తగ్గట్టు గానే ఈ మ్యాచ్ లో వాళ్లలో ఆడగలిగే కెపాసిటీ ఎంత ఉందో చూసి వీలైతే సెమీస్ లో కూడా ఆడించే అవకాశం అయితే ఉంది.ఇక సూర్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తను ఒక మ్యాచ్ లో ఆడితే మరో మ్యాచ్ లో ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితి లో ఒకసారి ఆల్టర్నేట్ ని కూడా చూసుకొని పెట్టుకుంటే బెటర్ అని చూడటానికి కూడా వీలు అవుతుంది అందుకే ఇషాన్ కిషన్ ని రంగం లోకి దింపుతున్నారు.ఇక ఇదే క్రమం లో పాండ్య రూల్డ్ ఔట్ అయిన తరువాత ఎవరు ఆల్ రౌండర్ గా కొనసాగే ఫాస్ట్ బౌలర్ బ్యాట్స్ మెన్ ఎవరు లేరు కాబట్టి శార్దూల్ ఠాకూర్ ని మరోసారి ఈ మ్యాచ్ లో ట్రై చేయనున్నట్టు గా తెలుస్తుంది…ఇక అలాగే ప్రసిద్ది కృష్ణ కి కూడా అవకాశం ఇవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది.అయితే ప్రసిద్ది కృష్ణ టీమ్ లోకి వస్తే మహమ్మద్ సిరాజ్ బెంచ్ కి పరిమితం అవ్వాల్సి ఉంటుంది…ప్రసిద్ది కృష్ణ టీమ్ లో ఉంటాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు…

    ఇక ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే

    ఓపెనర్లు గా శుభ్ మన్ గిల్ , రోహిత్ శర్మలు ఉన్నారు. ఇక నెంబర్ త్రీ లో విరాట్ కోహ్లీ ,నెంబర్ ఫోర్ లో ఇషాన్ కిషన్ ,నెంబర్ ఫైవ్ రాహుల్,నెంబర్ 6 లో రవీంద్ర జడేజా ,నెంబర్ 7 శార్దూల్ ఠాకూర్, నెంబర్ ఎయిట్ లో మహమ్మద్ శమి, నెంబర్ నైన్ లో కుల్దిప్ యాదవ్ ,నెంబర్ 10 లో జస్ప్రిత్ బుమ్రా,నెంబర్ 11 మహమ్మద్ సిరాజ్ లతో ఇండియన్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది…