Salaar OTT Rights : బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి క్లీన్ హిట్ లేదు. సాహో కనీసం హిందీలో విజయం సాధించింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ అయ్యాయి. అయినా ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాలకు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. ముఖ్యంగా సలార్ పై అంచనాలు ఆకాశానికి చేరాయి. ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోతో కెజిఎఫ్ సిరీస్తో దేశాన్ని ఊపేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. సలార్ బుకింగ్స్ ఓపెన్ అయితే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి అనడంలో సందేహం లేదు.
సలార్ చిత్రానికి ఉన్న హైప్ నేపథ్యంలో పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగింది. ఏపీ/తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 175 కోట్లకు అమ్మారట. సలార్ హిట్ కొట్టాలంటే తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలి. వరల్డ్ వైడ్ కూడా సలార్ ఇదే స్థాయిలో బిజినెస్ చేసింది. కాగా సలార్ ఓటీటీ హక్కులు సైతం అమ్మేశారట. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి అన్ని భాషల డిజిటల్ రైట్స్ దక్కించుకుందని సమాచారం.
నిర్మాతలు మొన్నటి వరకు రూ. 200 కోట్లు డిమాండ్ చేశారట. అయితే కొన్ని సినిమాల విషయంలో ఓటీటీ సంస్థలు విపరీతమైన నష్టాలు చవిచూశాయి. ఈ క్రమంలో పోటీపడి కోట్లు కుమ్మరించే పరిస్థితి లేదు. నెట్ఫ్లిక్స్ సలార్ ఓటీటీ హక్కులు రూ. 160 కోట్లకు సొంతం చేసుకుందట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. సలార్ మూవీతో నెట్ఫ్లిక్స్ తన చందాదారులు పెరుగుతారని భావిస్తుంది.
సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదలవుతున్న సలార్ చిత్రానికి షారుఖ్ ఖాన్ డంకీ చిత్రం నుండి గట్టి పోటీ ఎదురుకానుంది. పఠాన్, జవాన్ చిత్రాలతో షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. ఇద్దరు బడా హీరోల మధ్య పోటీ రసవత్తరంగా ఉండనుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, పృథ్విరాజ్ కీలక రోల్స్ చేస్తున్నారు.