Odi World Cup 2023: ప్రపంచ కప్ లో భారత్ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు వెనుకడుగు వేయకండా రోహిత్ సేన అన్ని మ్యాచులను గెలిచింది. దాయాది దేశం పాకిస్థాన్ పై రసవత్తరంగా ఆడి గెలుపొందింది. దీంతో ఐసీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్ పై గెలిచాక కోచ్ ద్రవిడ్ తో పాటు రోహిత్ సేన సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా మరో ఘనత సాధించింది. ఈ వరల్డ్ కప్ లో మంచి ఎకనామీ రేట్ తో బౌలింగ్ చేసిన విభాగంలో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు భారత్ ఆడింది మూడు మ్యాచులే అయినా ఇందులో మంచి బౌలింగ్ అటాక్ తో ఈ రేటింగ్ సాధించడంపై క్రీడాభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
టీమిండియా ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ దేశాలతో పోటీ పడింది. ఈ మూడు జట్లపై విజయం సాధించింది. ఈ క్రమంలో ఐసీసీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. బౌలింగ్ లోనూ మనవాళ్లు ముందున్నారు. పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో అహ్మదాబాద్ రన్ పిచ్ అయినా ఆ జట్టును బూమ్రా, ఇతర బౌలర్లు స్కోరు చేయకుండా కట్టడి చేశారు. 300 స్కోరు వెళ్లాల్సి ఉండగా.. 200 లోపే ముంగించేశారు. దీంతో బౌలర్లపై ప్రత్యేకంగా ప్రశంసలు దక్కాయి.
ఈ తరుణంతో తాజాగా మరో ఘనత సాధించారు. అన్ని జట్ల కంటే పొదుపుగా బౌలింగ్ చేసిన జట్ల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ కప్ లో 14 మ్యాచులు జరిగాయి. భారత్ మూడు ఆటల్లో పాల్గొంది. ఈ క్రమంలో బౌలర్లు 142.2 ఓవర్లు బౌలింగ్ చేసి 4.55 ఎకానమి రేటుతో 648 పరుగులు ఇచ్చారు. బౌలర్లు తీసుకున్న 28 వికెట్టు కూడా అత్యధికంగానే ఉన్నాయి. ఈ విషయంలో భారత్ తరువాత న్యూజిలాంగ్ ఉంది. ఆ జట్టు 5.10 ఎకానమి రేటు తో 748 రన్స్ ఇచ్చారు. 27 వికెట్లు తీశారు.
ఇప్పటి వరకు 5 సార్లు ఛాంపియన్ గా నిలచిన ఆస్ట్రేలియా సైతం మూడో స్థానానికి చేరింది. ఈ జట్టు మూడు మ్యాచుల్లో పాల్గొని 134.5 ఓవర్లు వేసి 5.25 ఎకానమి రేటుతో 709 రన్స్ చేసింది. 20 వికెట్లు తీశారు. ఆ తరువాత దక్సిణాఫ్రికా ఇప్పటి వరకు 2 మ్యాచుల్లో పాల్గొంది. 85.4 ఓవర్లు వేసి 5.75 ఎకానమి రేటుతో 494 పరుగులు చేసింది. ఆ తరువాత 5వ స్తానంలో ఇంగ్లాండ్ ఉంది. ఈ జట్టు ఇప్పటి వరకు మూడు ఆటల్లో పాల్గొంది. 134.5 ఓవర్ల బౌలింగ్ వేశారు. 5.82 ఎకానమి రేటుతో 784 పరుగులు చేసింది. 19 వికెట్లు తీసుకుంది. ఇలా ప్రత్యర్థి జట్టుకు పరుగులు ఇవ్వకుండా మంచి ఎకానమీ సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది.