ఒలింపిక్స్ లో భారత్ కు ఈ పోటీల్లో పతకాలకు చాన్స్!

టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు పతకాలు సాధించింది ఐదుగురే అయినప్పటికీ ఎంతో మంది అద్భుతమైన ఆటతీరు చూపి కొద్దిలో పతకం చేజార్చుకున్న వారు ఉన్నారు. అయితే వీరి స్ఫూర్తిదాయకమైన ఆటతీరు… విజయం సాధించకపోయినా దేశం మొత్తంలో క్రీడల పట్ల సరైన స్ఫూర్తి ప్రేరణ తీసుకువచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శనివారం నలుగురు భారత అథ్లెట్లు వేర్వేరు విభాగాల్లో దేశానికి పతకం అందించేందుకు పోరాడుతున్నారు. వీటిలో ఒక్క రెజ్లింగ్ మినహాయించిమిగిలిన విభాగాల్లో […]

Written By: Kusuma Aggunna, Updated On : August 7, 2021 5:32 pm
Follow us on

టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు పతకాలు సాధించింది ఐదుగురే అయినప్పటికీ ఎంతో మంది అద్భుతమైన ఆటతీరు చూపి కొద్దిలో పతకం చేజార్చుకున్న వారు ఉన్నారు. అయితే వీరి స్ఫూర్తిదాయకమైన ఆటతీరు… విజయం సాధించకపోయినా దేశం మొత్తంలో క్రీడల పట్ల సరైన స్ఫూర్తి ప్రేరణ తీసుకువచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

శనివారం నలుగురు భారత అథ్లెట్లు వేర్వేరు విభాగాల్లో దేశానికి పతకం అందించేందుకు పోరాడుతున్నారు. వీటిలో ఒక్క రెజ్లింగ్ మినహాయించిమిగిలిన విభాగాల్లో ఇప్పటివరకు భారత క్రీడాకారులు ఒక్క పతకం కూడా గెలవలేదు. కాబట్టి రేపు మన క్రీడాకారులు తొలిసారి ఈ విభాగాల్లో దేశానికి పతకం అందిస్తారేమో చూడాలి…!

గోల్ఫ్ క్రీడలో భారతదేశపు తొలి ఒలింపిక్ పతక విజేత అయ్యే అపూర్వ అవకాశం ముంగిట నిలిచి ఉన్న గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ పర్ఫార్మెన్స్ మీదే శనివారం అందరి దృష్టి నెలకొంది. మూడో రౌండ్ తర్వాత ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఇటు నీరజ్ చోప్రా కూడా జావెలిన్ త్రో ఫైనల్‌ కి అర్హత సాధించింది. ఉదయం అదితి అశోక్ పోటీ ముగిసిన తరువాత భారత క్రీడా ప్రేక్షకులంతా ఈ పోటీల్లో తమ దేశం తొలి పతకం సాధించాలని అశిస్తున్నారు.

శనివారం: ఆగస్టు 7, 2021

గోల్ఫ్

4:17 AM: మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4 (దీక్షా దగర్)

4:48 AM: మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4 (అదితి అశోక్)

రెజ్లింగ్

3:55 PM: పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోల కాంస్య పతక మ్యాచ్ (బజరంగ్ పునియా)

అథ్లెటిక్స్

4:30 PM: పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (నీరజ్ చోప్రా)