https://oktelugu.com/

భారత్ రన్నర్లు రికార్డు.. కానీ పతకం కొట్టలేకపోయారు.. ఎందుకంటే?

  టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకూ భారత జట్టు 2 రజతాలు 3 కాంస్యాలు సాధించి పతకాల పట్టికలో 66 వ స్థానంలో నిలిచింది. ఈరోజు 4×400 మీటర్ల రిలే పరుగుపందెంలో భారత అథ్లెట్లు ఆసియా రికార్డు నెలకొల్పారు. అయితే వారు నెలకొల్పిన టైమింగ్ ఒలింపిక్స్ ఫైనల్ కు మాత్రం అర్హత సాధించలేకపోయింది. భారత్ కి చెందిన నలుగురు అథ్లెట్లు అయిన మహమ్మద్ అనాస్ యాహియ, నోవా నిర్మల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 7, 2021 / 12:02 PM IST
    Follow us on

     

    టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకూ భారత జట్టు 2 రజతాలు 3 కాంస్యాలు సాధించి పతకాల పట్టికలో 66 వ స్థానంలో నిలిచింది.

    ఈరోజు 4×400 మీటర్ల రిలే పరుగుపందెంలో భారత అథ్లెట్లు ఆసియా రికార్డు నెలకొల్పారు. అయితే వారు నెలకొల్పిన టైమింగ్ ఒలింపిక్స్ ఫైనల్ కు మాత్రం అర్హత సాధించలేకపోయింది. భారత్ కి చెందిన నలుగురు అథ్లెట్లు అయిన మహమ్మద్ అనాస్ యాహియ, నోవా నిర్మల్ టామ్, అరోకియ రాజీవ్, అమోల్ జాకబ్ 4×400మీ రిలే పరుగు పందాన్ని మూడు నిమిషాల 25 మిల్లీ సెకన్లలోనే పూర్తి చేశారు.

    అయితే కేవలం టాప్-8 టీమ్ లు మాత్రమే ఫైనల్స్ కి అర్హత సాధిస్తాయి. భారత అథ్లెట్లు 9 వ స్థానంలో నిలిచారు. అయితే భారత నమోదు చేసిన ఈ సమయం ఆసియా ఖండం లోనే రికార్డు. గతంలో మూడు నిమిషాల 56 మిల్లీసెకండ్లతో ఈ రికార్డు ఖతర్ దేశం పేరు మీద ఉండేది. వీరు 2018 ఆసియా గేమ్స్ లో దీన్ని నెలకొల్పారు.

    ఇలా ఆసియా ఖండంలో నే రికార్డు బ్రేకింగ్ టైమింగ్ ఒలింపిక్స్ లో ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది అంటే ఒలింపిక్స్ ప్రమాణాలు ఎంత స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. నలుగురు అథ్లెట్లలో చివరిగా పరిగెత్తిన జాకబ్ అందరి కంటే అత్యుత్తమ టైమింగ్ నమోదు చేశాడు. రాజీవ్ నుండి బ్యాటన్ తీసుకుని అతను 44.8 సెకండ్లలో ఫినిష్ లైన్ దాటాడు. జాతీయ రికార్డుగృస్థుడు అయిన అనాస్ మాత్రం 45.60 సెకండ్లు తన దూరాన్ని పరిగెత్తి అందరికన్నా ఎక్కువ సమయం నమోదు చేశాడు.

    ఇక మిగిలిన పరుగుపందేల విషయానికి వస్తే జాతీయ రికార్డు హోల్డర్ అయిన ప్రియాంక గోస్వామి ఇరవై కిలోమీటర్ల నడక పందెంలో 17వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. ఇక 50 కిలోమీటర్ల నడక పందెంలో భారత్ కి చెందిన గురుప్రీత్ సింగ్ 35 కిలోమీటర్లు దాటిన తర్వాత పోటీ నుండి తప్పుకున్నాడు. నగరంలో ఉండే వేడి తట్టుకోలేక ఇతను రేస్ ని కొనసాగించలేదు.