https://oktelugu.com/

Dhoni: ఫైనల్ మ్యాచ్ లో ధోనీ ఉంటే కప్పు ఇండియానే గెలిచేది.. ఎలా అంటే..?

అయితే ఈ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్లు చాలా వరకు ఫెయిల్ అయ్యారు.ఇక మన బ్యాట్స్ మెన్స్ ఈ మ్యాచ్ లో 240 పరుగులు చేశారు. ఇక ఇండియా ఈ సీజన్ లో చాలా తక్కువ స్కోర్ చేసిన మ్యాచుల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 20, 2023 / 05:26 PM IST
    Follow us on

    Dhoni: క్రికెట్ లో ఒక మ్యాచ్ గెలవాలి అంటే టీం లో ఉన్న ప్లేయర్లందరు కూడా తమదైన రీతిలో మంచి పర్ఫామెన్స్ ఇస్తూ మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లాలి. అయితే ఇండియన్ టీమ్ లీగ్ దశలో బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ప్రత్యర్థి టీమ్ ని భయపెట్టే రేంజ్ లో పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చింది.ఇక అందులో భాగం గానే అన్ని టీమ్ లను ఓడించింది. ఇక సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది.ఇక ఫైనల్ లో కూడా ఆస్ట్రేలియాను ఓడిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఇండియన్ టీమ్ ఒక పూర్ పర్ఫామెన్స్ ఇవ్వడం వల్ల ఆస్ట్రేలియా టీమ్ చేతిలో ఇండియా మరోసారి భారీ అపజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

    అయితే ఈ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్లు చాలా వరకు ఫెయిల్ అయ్యారు.ఇక మన బ్యాట్స్ మెన్స్ ఈ మ్యాచ్ లో 240 పరుగులు చేశారు. ఇక ఇండియా ఈ సీజన్ లో చాలా తక్కువ స్కోర్ చేసిన మ్యాచుల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఇక ఫైనల్ మ్యాచ్ కి ఇంత తక్కువ స్కోరు కొట్టడం అనేది ఇండియన్ టీమ్ ఫెయిల్యూర్ కి కారణమని చాలామంది క్రికెట్ మేధావులు సైతం చెబుతున్నారు. ఎందుకంటే లీగ్ దశలో గానీ , సెమీఫైనల్ లో గాని 300 లేదా అంతకంటే పై చిలుకు పరుగులు చేసిన ఇండియన్ టీమ్ ఇప్పుడు మాత్రం ఇలా తడబడడం చూసి క్రికెట్ అభిమానులు అందరూ తట్టుకోలేకపోతున్నారు. అయితే 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీమ్ మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడింది. ఇక ఆ తర్వాత లబుశణ్, హెడ్ ఇద్దరిని కంట్రోల్ చేయడంలో ఇండియన్ టీం బౌలర్లు చాలా వరకు ఫెయిల్ అయ్యారు…

    ఇక ఇక్కడే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు చాలా మంది ఈ సిచువేషన్ లో మహేంద్రసింగ్ ధోనీ కనక ఉన్నట్టయితే ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయిన వెంటనే ధోని తన స్ట్రాటజీతో మిగితా వికెట్లు కూడా తీసేవాడు అంటూ ధోని గొప్పదనం గురించి తెలియజేస్తున్నారు తను లేని లోటు తీర్చలేనిది అంటూ ధోని మీద ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ లో ధోని కంట్రోల్ చేసినంత ప్రెజర్ ని ఎవరు కంట్రోల్ చేయలేరు అనేది మరొకసారి ఈ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది…రోహిత్ శర్మ చాలా టెన్షన్ పడ్డాడు అదే ధోనీ అయితే కూల్ గా మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్ళేవాడు…

    ఇక మొత్తానికి మహి బాయ్ ఉండుంటే ఆస్ట్రేలియాని బోల్తా కొట్టించి మ్యాచ్ మొత్తాన్ని మన వైపు తిప్పేసేవాడు అంటూ సోషల్ మీడియాలో పలువురు ధోనీ గురించి గొప్పగా చెప్తున్నారు… ధోని మైండ్ లో ఉన్నంత స్ట్రాటజీలు ఆయన టీమ్ విజయం కోసం వేసిన ప్లాన్స్ ఇండియన్ టీం లో గాని, ప్రపంచంలో గాని ఏ ఒక్క ప్లేయర్ గానీ కెప్టెన్ గాను వేయలేరు. ధోని ప్లాన్స్ వేయడమే కాదు వాటిని సక్సెస్ ఫుల్ గా చేసి చూపిస్తాడు