Virat Kohli: ప్రపంచ క్రికెట్ చరిత్రలో చాలామంది ప్లేయర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతు వాళ్ళ టీమ్ కి మంచి విజయాలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలో చాలామంది ప్లేయర్లు సెంచరీలు, ఆఫ్ సెంచరీలు చేసి వాళ్ళ టీం కి అరుదైన విజయాలను అందిస్తూ ఉంటారు. ఇక మన ఇండియన్ టీం కి చెందిన విరాట్ కోహ్లీ సైతం సూపర్ ఇన్నింగ్స్ లు ఆడుతూ ఇండియన్ టీం కి తనదైన గెలుపులను అందిస్తూ వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కోహ్లీ ఇప్పటికే 48 సెంచరీలు చేసి ఇంకొక్క సెంచరీ చేస్తే సచిన్ తో సమంగా సెంచరీ లు చేస్తాడు.అయితే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తన 49వ సెంచరీ పూర్తి చేసుకునేవాడు కానీ చివర్లో ఎక్కువగా రన్స్ లేకపోవడంతో ఆయన 95 పరుగుల వద్ద అవుట్ అయిపోవడం జరిగింది.
ఇలాంటి క్రమంలోనే అతి తొందరలోనే కోహ్లీ వన్డేల్లో 50 వ సెంచరీ కూడా పూర్తి చేసుకొని ప్రపంచం లోనే మొదట సారి గా 50 సెంచరీ లు పూర్తి చేసిన ప్లేయర్ గా మంచి గుర్తింపు పొందుతాడు. నిజానికి కోహ్లీ ని అందరూ అభిమానులు రన్ మిషన్ అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే ఆయన చాలా ఈజీ గా సెంచరీ లు చేస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా మినిమం యావరేజ్ స్కోర్ ని చేస్తూ విజయంలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు.
అయితే కోహ్లీ ఇప్పటివరకు చేసిన సెంచరీలో చాలా వరకు విజయాలను నమోదు చేసుకున్నాడు. ముఖ్యంగా చేజింగ్ లో అయితే తను సెంచరీ చేశారంటే కచ్చితంగా ఆ మ్యాచ్ విజయం సాధించిందనే చెప్పాలి…ఇక ఇలాంటి క్రమంలో కోహ్లీ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ది బెస్ట్ బ్యాట్స్ మెన్ గా నిలుస్తున్నాడు.అలాగే సచిన్ టెండుల్కర్ క్రియేట్ చేసిన అన్ని రికార్డులని కూడా కోహ్లీ బ్రేక్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…
నిజానికి ఏ ప్లేయర్ కి లేని విధంగా కోహ్లీ పేరు మీద చాలా మంచి రికార్డు లు కూడా ఉన్నాయి. సచిన్ టెండుల్కర్ 49 సెంచరీలు చేస్తే అందులో 33 సార్లు ఇండియన్ టీమ్ విజయం సాధించింది. కానీ కోహ్లీ 48 సెంచరీలు చేస్తే అందులో 40 మ్యాచులు ఇండియానే గెలిచింది.అంటే దాదాపు 85% కంటే ఎక్కువ మ్యాచ్ లు కోహ్లీ సెంచరీ లో గెలిచాయనే చెప్పాలి. ఇక సచిన్ టెండూల్కర్ కంటే కూడా కోహ్లీ సాధించిన రికార్డ్ చాలా పెద్దదనే చెప్పాలి.ఈ క్రమంలో కోహ్లీ ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తానికి ప్రస్తుతం ఆదర్శంగా నిలుస్తున్నాడు…