https://oktelugu.com/

Game Changer Teaser : దేవర’ ఫుల్ రన్ వ్యూస్ ని 2 రోజుల్లో దాటేసిన ‘గేమ్ చేంజర్’ హిందీ టీజర్ వ్యూస్..డామినేషన్ మామూలుగా లేదుగా!

హిందీ లో ఈ టీజర్ కి ఇప్పటి వరకు 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు, ఎన్టీఆర్ నటించిన దేవర గ్లిమ్స్ వీడియో కి 8 నెలలకు కలిపి 25 మిలియన్ కి పైగా వ్యూస్ వస్తే, రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' హిందీ టీజర్ కి కేవలం రెండు రోజుల్లోనే 25 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 10:04 PM IST

    Game Changer Teaser

    Follow us on

    Game Changer Teaser :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ మూవీ టీజర్ ఇటీవలే విడుదలై యూట్యూబ్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టింది. మొదటి రోజు తెలుగు, హిందీ, తమిళ భాషలకు కలిపి 70 మిలియన్ కి పైగా వ్యూస్ ని సాధించిన ఈ టీజర్, ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది. తెలుగు టీజర్ కి ఇప్పటి వరకు 5 లక్షల 40 వేల లైక్స్, 46 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అతి త్వరలోనే 50 మిలియన్ మార్కుని అందుకోనుంది. అదే విధంగా హిందీ లో ఈ టీజర్ కి ఇప్పటి వరకు 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు, ఎన్టీఆర్ నటించిన దేవర గ్లిమ్స్ వీడియో కి 8 నెలలకు కలిపి 25 మిలియన్ కి పైగా వ్యూస్ వస్తే, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ హిందీ టీజర్ కి కేవలం రెండు రోజుల్లోనే 25 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

    దీనిని బట్టి చూస్తే రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కంటే నార్త్ లో ఎక్కువ క్రేజ్ ఉందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి ముందు నుండే నార్త్ ఇండియా లో మంచి క్రేజ్ ఉంది అనే విషయం వాస్తవమే. గతంలో రామ్ చరణ్ ‘మగధీర’ చిత్రంతో మంచి క్రేజ్, పాపులారిటీ ని సంపాదించాడు. అలా మగధీర తో వచ్చిన ఫేమ్ ని ఉపయోగించుకుంటూ బాలీవుడ్ లో జంజీర్ అనే చిత్రం చేసాడు రామ్ చరణ్. తెలుగు లో ఈ సినిమా ‘తుఫాన్’ పేరిట విడుదలైంది. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి హిందీలో 28 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఆరోజుల్లోనే రామ్ చరణ్ కి హిందీ లో ఇలాంటి క్రేజ్ ఉండేది.

    అందుకే ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ‘దేవర’ కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే. శంకర్ కి కూడా బాలీవుడ్ లో మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది కానీ, రీసెంట్ గా విడుదలైన ‘ఇండియన్ 2 ‘ చిత్రం ఘోరమైన డిజాస్టర్ అందుకోవడంతో ‘గేమ్ చేంజర్’ పై కొంచెం అంచనాలు తగ్గాయి. కానీ ఎప్పుడైతే టీజర్ విడుదలైందో, అప్పటి నుండి ఈ సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇదే ఊపు ని కొనసాగిస్తే మొదటి రోజు నార్త్ ఇండియా లో ఈ చిత్రం 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే అవకాశం ఉంది.