https://oktelugu.com/

INDW Vs NZW: ఆదిలోనే హంసపాదు.. ఇలా ఓడిపోతే పొట్టి కప్ కల సాకారం అయ్యేది ఎన్నడు?

టి20 వరల్డ్ కప్ టోర్నీ మొదలవుతోందనే వార్తలు రాగానే భారత మహిళా క్రికెట్ జట్టుపై ఎన్నో అంచనాలు పెరిగాయి. ఇటీవలి సన్నాహక మ్యాచ్ లలో భారత్ వరుస విజయాలు సాధించింది. దీంతో ఈసారి కప్ సాధించే సత్తా ఉన్న జట్లలో భారత్ కూడా ఒకటని అందరూ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది వేరు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 5, 2024 / 08:15 AM IST

    INDW Vs NZW

    Follow us on

    INDW Vs NZW: ఆదిలోనే హంసపాదు.. ప్రారంభంలోనే చుక్కెదురు.. ఆరంభంలోనే అనుకోని కుదుపు. ఇలా ఎన్ని పదాలు వాడితే అన్ని.. ఎందుకంటే శుక్రవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత్ అంతటి దారుణ ప్రదర్శన చేసింది కాబట్టి.. హర్మన్ ప్రీత్ కౌర్ దారుణమైన పరాజయంతో టోర్నీని మొదలుపెట్టిన నేపథ్యంలో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టుకు దారుణమైన రికార్డు ఉన్నప్పటికీ.. దానిని అలాగే కొనసాగిస్తూ హర్మన్ ప్రీత్ కౌర్ పరువు తీసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఎక్కువ పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో.. భారత జట్టు సెమీస్ విజయావకాశాలపై పెద్ద దెబ్బ పడింది. ఏకంగా 58 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత జట్టుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ (57), ఓపెనర్ జార్జియా ఫ్లిమర్(34) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 2/27, ఆశా శోభన 1/22, అరుంధతి రెడ్డి 1/28 సత్తా చాటారు. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభం నుంచి తడబడింది.

    రోజ్ మేరీ మైర్ దెబ్బకు..

    న్యూజిలాండ్ బౌలర్ రోజ్ మేరీ మైర్ దెబ్బకు భారత్ వణికిపోయింది. రోజ్(4/19) సత్తా చాటడంతో భారత్ టాప్ ఆర్డర్ కాకవికలం అయిపోయింది. లియా (3/15), ఈడెన్(2/34) అద్భుతంగా బౌలింగ్ వేయడంతో 19కే భారత్ 102 రన్స్ కు కుప్పకూలిపోయింది. భారత జట్టులో హర్మన్ చేసిన 15 పరుగులు హైయెస్ట్ స్కోర్ అంటే.. మన వాళ్ళ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు .. ఇక ఈ ఓటమి తర్వాత ఆదివారం భారత్ తన తర్వాత మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో ఢీకొంటుంది. టి20లలో 161 పరుగుల లక్ష్యాన్ని సాధించడం అంత సులువైన విషయం కాదు. పైగా మందకొడి మైదానాలపై బౌలర్ల ఆధిపత్యం సంపూర్ణంగా సాగుతున్న సమయంలో.. అది కఠినమైన సవాల్. అయితే బ్యాటింగ్ ఆర్డర్ బలవంతంగా కనిపిస్తున్న భారత జట్టు.. చేజింగ్ గట్టిగా చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ అంచనాలు నీటి మీద రాతలయ్యాయి. పేరుపొందిన ఆటగాళ్లు ప్లేయర్ల మొత్తం విఫలమయ్యారు. క్రీజ్ లో నిలబడలేకపోయారు.. దారుణమైన షాట్లు ఆడి వికెట్లు పోగొట్టుకున్నారు.. న్యూజిలాండ్ స్పిన్నర్ ఈడెన్ భారత జట్టును తొలిదెబ్బ కొట్టింది. ఆమె బంతిని సరిగ్గా అంచనా వేయలేక షెపాలి(2) రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. కాసేపటికి స్మృతి (12) ఈడెన్ బౌలింగ్ లోనే భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి అవుట్ అయింది.. కెప్టెన్ హర్మన్ నిలకడగా ఆడినప్పటికీ.. రోజ్ మేరీ పదునైన బంతివేగంతో వికెట్ల ముందు దొరికిపోయింది. హర్మన్ రివ్యూ కోరినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. 42 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టును.. మిగతా బ్యాటర్లు ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ప్రతి ఒక్కరూ షాట్ కొట్టడానికి ప్రయత్నించడం.. అవుట్ అవ్వడం ఇలానే సాగిపోయింది. జెమీమా(13), రిచా(12), దీప్తి(13) ను తహుహు ఔట్ చేసి… భారత జట్టుకు పరాజయాన్ని ఖరారు చేసింది. రోజ్ మేరీ లోయర్ ఆర్డర్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో మరో మిగిలి ఉండగానే భారత్ కథ ముగిసింది..

    సత్తా చాటిన సుజి

    ఇక న్యూజిలాండ్ జట్టులో సుజి (27) సత్తా చాటింది. వాస్తవానికి ఈ టోర్నీలో హైయెస్ట్ స్కోర్ చేసిన సూజీ.. ప్రారంభంలో నిదానంగా బ్యాటింగ్ చేసింది. మరోవైపు ఫ్లిమ్మర్ మందకొడి మైదానంపై పరుగుల వరద పారించింది. తొలి వికెట్ కు వీరిద్దరూ 67 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత మీరు త్వరత్వరగానే అవుట్ అయ్యారు. అనంతరం మైదానంలోకి వచ్చిన సోఫీ డివైన్ న్యూజిలాండ్ జట్టు ఇన్నింగ్ భారాన్ని భుజాలకు ఎత్తుకుంది. అమేలియా(13), బ్రూక్(16) తోడ్పాటుతో జట్టు స్కోర్ ను 160 రన్స్ కు చేర్చింది. రేణుక చివరి రెండు భవనలో రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ జట్టు జోరుకు బ్రేక్ వేసింది. లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.