https://oktelugu.com/

WIW Vs SAW: మందకొడి మైదానం పై తేలిపోయిన మాజీ ఛాంపియన్…టీ 20 మహిళా వరల్డ్ కప్ టోర్నీ లో సంచలనం

అసలే అవి మందకొడి మైదానాలు.. గట్టిగా ఎదుర్కొంటే తప్ప పరుగులు తీయడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో బరిలోకి దిగిన మాజీ ఛాంపియన్ కు చుక్కలు కనిపించాయి. దూసుకు వస్తున్న బంతులను ఎదుర్కోలేక.. ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో దారుణమైన ఓటమి తప్పలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 5, 2024 / 08:31 AM IST

    WIW Vs SAW

    Follow us on

    WIW Vs SAW: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మహిళల టి20 వరల్డ్ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ కప్ లో శుక్రవారం సంచలనం నమోదు అయింది.. గత 8 సంవత్సరాలుగా ట్రోఫీ కోసం కళ్ళు కాయలు కాచే విధంగా నిరీక్షిస్తున్న దక్షిణాఫ్రికా.. పొట్టి కప్ వేటను అద్భుతంగా మొదలుపెట్టింది. లీగ్ దశ తొలి మ్యాచ్ లో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘనమైన గెలుపును సొంతం చేసుకుంది.. దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ముందుగా బంతితో కరేబియన్ జట్టు క్రీడాకారులను దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బంతితో వణికించారు. లక్ష్యం స్వల్పం కావడంతో.. ఆ తర్వాత బ్యాట్ తో వీర విహారం చేశారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు లారా (59*), తంజిమ్(57*) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. మెగాటోనీలలో విండీస్ బౌలర్లకు అద్భుతమైన రికార్డు ఉంది. అయితే వారి బౌలింగ్ ను ఉతికి ఆరేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. అద్భుతమైన విజయాన్ని జట్టుకు అందించారు.. లారా, తంజిమ్ వీర విహారం చేయడంతో వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది.

    వెస్టిండీస్ జట్టు మాజీ ఛాంపియన్ గా ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఈ దశలోనూ భయపడలేదు.. దూకుడుగా బౌలింగ్ చేశారు. ధైర్యంగా బ్యాటింగ్ చేశారు. అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. మొత్తానికి అన్ని రంగాలలో అనితర సాధ్యమైన ఆట తీరు ప్రదర్శించారు. అందువల్లే కరేబియన్ జట్టును తక్కువ పరుగులకే నిలుపుదల చేశారు. అనంతరం వెస్టిండీస్ విధించిన 119 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సులువుగా ఛేదించారు. ముఖ్యంగా పవర్ ప్లే లో దక్షిణాఫ్రికా జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. లారా, తంజిమ్ విపరీతమైన జోరు చూపించింది. బౌండరీలను ఇష్టానుసారంగా బాదింది. వెస్టిండీస్ బౌలర్ల ధైర్యాన్ని దెబ్బ కొట్టింది.. ఈ క్రమంలోనే కరేబియన్ కెప్టెన్ హీలి బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న లారా, తంజిమ్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు నడిపించారు. దీంతో దక్షిణాఫ్రికా రెండు పాయింట్లు సొంతం చేసుకొని.. మంచి రన్ రేట్ పొందింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు.. ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు చుక్కలు చూపించింది. 15 పరుగులకే వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆల్ రౌండర్ మరి జానే (2/14) ఓపెనర్ హీలి ని ఔట్ చేసింది. ఆ తర్వాత క్వియా నా జోసెఫ్ (4)ను లబా(4/29) బోల్తా కొట్టించింది. ఈ దశలో స్టఫాని(44), డియండ్రా (13) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును కాస్త ఆదుకున్నారు.. ఈ దశలో మరిజా మరోసారి చెలరేగింది..డియండ్రాను వెనక్కి పంపించింది. దీంతో వెస్టిండీస్ 62 పరుగులకే సగం వికెట్లను నష్టపోయింది. ఈ దశలో టేలర్, జైదా(15*) దూకుడుగా బ్యాటింగ్ చేసి.. కాస్తలో కాస్త వెస్టిండీస్ జట్టుకు మెరుగైన స్కోర్ చేసే అవకాశాన్ని కల్పించింది.