India Vs West Indies 2nd T20: ఇండియన్ టీం లో ఉన్నది అంతా ఆరితేరిన బ్యాటర్లే అయినప్పటికీ.. తొలి టీ 20 మ్యాచ్లో అతి స్వల్ప లక్ష్యాన్ని సాధించలేక చేతులెత్తేశారు. వన్డే ప్రపంచ కప్ ఎక్కువ దూరంలో లేదు.. పైగా ఈసారి ఆతిథ్యం ఇస్తుంది మనమే. ఇలాంటి కీలకమైన నేపథ్యంలో సత్తా నిరూపించుకోవడం ఎంతో కీలకం. మ్యాచ్లో 11 మంది ప్లేయర్లు ఉన్నారు అంటే 11 మంది నిలబడి ఆడే విధంగా ఉండాలి తప్ప ఒకళ్ళిద్దరిపై భారం వేసి అంతా వాళ్లే నడిపించాలి అనుకుంటే కష్ట
ఈ క్రమంలో టీం ఇండియా బ్యాటింగ్ విభాగంలో పుంజుకోవాలి.. వెస్టిండీస్ తో నేడు జరగనున్న రెండో టీ20 మ్యాచ్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఈ మ్యాచ్ లో ఆడే టీం పైనే ఉంది. మరో పక్క టీమిండియా కూడా ఈసారి తన సత్తా చూపించాలి అన్న పట్టుదలతో పోరాటానికి సిద్ధపడుతుంది. మరోపక్క వెస్టిండీస్ కూడా పుంజుకుంటున్నట్లే కనిపిస్తోంది.
బ్యాటింగ్కు పెద్దగా అనుకూలించని స్లో పిచ్ పై కూడా తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై ఆధిక్యత సాధించింది వెస్టిండీస్. మరి రెండవ టి20కి ఏర్పాటు చేసిన పిచ్ కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో
హార్దిక్ నేతృత్వంలో టీం ఇండియా ఏ రకంగా ఆడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా గెలవాలి అంటే బ్యాటర్లు తమ సత్తా చూపించక తప్పదు.
150 పరుగుల లక్ష్యం 20 ఓవర్లలో సాధించడం అనేది బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టుకి కష్టతరమైన అంశం కాదు. హార్దిక్ పాండ్యా ,సూర్య కుమార్ యాదవ్ సమిష్టిగా మెరుగైన ప్రదర్శన కనబరచాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మ్యాచ్లో ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషన్ మరియు శుభ్‌మన్ గిల్ కాస్త తడబడ్డారు. అదే తడబాటు చివరి ప్లేయర్ వరకు కంటిన్యూ అయింది. ఒక్క తిలక్ వర్మా మినహా మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారని చెప్పవచ్చు.
తిలక్ వర్మ అరంగేట్రంలోనే తన బ్యాటింగ్ సత్తా చూపించాడు. చక్కని షాట్లతో ఉసురు మంటున్న భారత క్రికెట్ అభిమానులకు కాస్త ఊరట కలిగించాడు. అయితే సీరియస్ మొదటి మ్యాచ్ కైవసం చేసుకున్న విండీస్ జట్టు మంచి ఉత్సాహం మీద ఉంది. సిరీస్లో బోణీ కొట్టాం కాబట్టి సిరీస్ కూడా మాదే అన్న కాన్ఫిడెన్స్ విండీస్ టీమ్ లో బాగా కనిపిస్తుంది. మరోపక్క మొదటి మ్యాచ్ చేయి జారిపోయింది రెండవ మ్యాచ్ గెలవకపోతే ఇబ్బంది పడతాం అన్న ప్రెషర్ భారత్ టీం పై ఎక్కువగా కనిపిస్తుంది. విండీస్ బౌలర్లు ఫస్ట్ మ్యాచ్ లోనే భారత్ బాటర్లకు కళ్లెం వేశారు. మరోపక్క ఆ టీమ్ లో ఉన్న హిట్టర్ల కూడా చాలా బలంగా ఉన్నారు.
అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్లో భారత్ టీం కి కలిసి వచ్చే అంశం ఒక్కటి మాత్రం ఉంది. రెండవ టి20 మ్యాచ్ జరగనున్న వేదిక విండీస్ జట్టుకి అచ్చి వచ్చినట్టు రికార్డులో లేదు. ఇక్కడ జరిగిన 11 మ్యాచులలో మూడు వర్షం కారణంగా రద్దు అయితే, మిగిలిన 8 మ్యాచ్లలో వెండిస్ కేవలం మూడు మ్యాచ్లు గెలిచింది. సగటును తీసుకుంటే ఈ పిచ్చి విండీస్ కి అచ్చి వచ్చే అవకాశం తక్కువ. ఈ పిచ్చి పై విండీస్ బ్యాటర్లకు పరుగులు తీయడం కూడా కాస్త కష్టతరమే. మరి ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయే రెండవ టి20 మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి..