Homeజాతీయ వార్తలుCM KCR: కేసీఆర్ కు భయపడుతున్న ఆంధ్ర నేతలు!

CM KCR: కేసీఆర్ కు భయపడుతున్న ఆంధ్ర నేతలు!

CM KCR: కేసీఆర్‌.. ఈ పెరు చెబితేనే ఆంధ్రా రాజకీయ నేతల వెన్నులో వణుకు పుడుతున్నట్లు ఉంది. 60 ఏళ్లు ఉమ్మడిగా సాగిన తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్‌ రాజధానిగా ఉంది. దీంతో ఆంధ్రా నేతలంతా వేల కోట్ల విలువైన ఆస్తులను అక్కడే కూడబెట్టుకున్నారు. 10 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగింది. దీంతో మనుషులు ప్రాంతాలుగా విడిపోయారు. ఆస్తులు మాత్రం ఉన్నాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిట్టినా.. కొట్టినా నోరు మెదపలేని పరిస్థితి. నోరెత్తితే తమ ఆస్తులకు ఎక్కడ ఎసరు పెడతాడో అన్న భయం. లేనిపోని చిక్కులు సృష్టిసాడో అన్న ఆందోళన. దీంతో ఆంధ్రా నేతలు విభజన డిమాండ్లు, విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఆస్తులు కూడా అడగలేని పరిస్థితి. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. గతంలో జగన్‌ సర్కార్‌ కూడా విలీనం చేసింది. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో చాలా వరకు ఆర్టీసీ ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. తెలంగాణలో 70 శాతం ఆస్తులు ఉంటే.. ఆంధ్రాలో 20 శాతం ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం ఆంధ్రాకు తెలంగాణ ఆర్టీసీ ఆస్తుల్లో వాటా ఇవ్వాలి. కానీ తెలంగాణ ఇవ్వడం లేదు. ఇక అడగాల్సిన ఆంధ్రా నేతలు ఆ విషయాన్నే మర్చిపోయారు. అమ్మో కేసీఆర్‌ను ప్రశ్నించడమా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో హక్కుగా రావాల్సినవి కూడా సాధించుకోలేని పరిస్థితి.

పారిపోయిన చంద్రబాబు..
వాస్తవానికి హైదరాబాద్‌ ఇప్పటికీ ఉమ్మడి రాజధానే. విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్‌ రాజనధానిగా కొనసాగుతుంది. కానీ, 2015లో చంద్రబాబు నాయుడు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారు. కేసీఆర్‌ పన్నిన వలలో పడి రాత్రికి రాత్రి.. హైదరాబాద్‌ విడిచి ఆంధ్రాకు పారిపోయాడు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ కూడా హైదరాబాద్‌లో తనకు భారీగా ఆస్తులు ఉండడం, 2014లో చంద్రబాబును ఓడించేందుకు కేసీఆర్‌ సాయం తీసుకోవడం.. తదితర కారణాలతో ఆంధ్రాకు రావాల్సిన ఆస్తుల గురించి అడగడంలేదు. తమ ఆస్తుల కోసం ఆంధ్రా ప్రజల ఆస్తులను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారు.

గవర్నర్‌ ప్రశ్నలు అవే..
ఏపీ నేతలు కేసీఆర్‌ను అడగాల్సిన ఆర్టీసీ ఆస్తులను తాజాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వాన్ని అడిగారు. ఆర్టీసీ విలీన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదానికి పంపింది. దాంట్లో ఐదు సందేహాలను మొదట గవర్నర్‌ ప్రభుత్వాన్ని అడిగారు. దానికి సీఎస్‌ శాంతికుమారి వివరణ ఇచ్చారు. తర్వాత మళ్లీ కొన్ని సందేహాలు లేవనెత్తారు.

– ఆర్టీసీలో కేంద్రం వాటా 30 శాతం ఉంది. ఆర్టీసీకి కేంద్రం అనుమతి కూడా ఉండాలి. అనుమతి తీసుకుంటే ఆ ప్రతిని పంపండి.

– ఆర్టీసీ పరిరక్షణకు చట్టబద్ధంగా తీసుకునే చర్యలు ఏమిటో తెలపండి.

– సంస్థలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు కేటగిరీల వారీగా ఇవ్వండి. కాంట్రాక్టు, క్యాజువల్‌ విరాలూ ఇవ్వండి.

– భూములు, భవనాలు, ఆర్టీసీ స్థిర, చర ఆస్తులు, వాటిని కార్పొరేషన్‌ వద్దే ఉంచుతుందా.. లేక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా..తెలుపండి.

సెక్షన్‌–9, సెక్షన్‌–10 ప్రకారం ఆంధ్రా వాటా 15 శాతం. ఆమేరకు ఆస్తులు ఏపీకి ఇవ్వాలి. కానీ గవర్నర్‌కు పంపిన బిల్లులో ఈ విషయం పేర్కొనలేదు. దీంతో ఏపీ నేతలు అడగాల్సిన ప్రశ్నలను కూడా తెలంగాణ గవర్నరే కేసీఆర్‌ సర్కార్‌ను స్పష్టంగా అడగడం గమనార్హం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version