https://oktelugu.com/

Odi World Cup 2023: ఇండియా శ్రీలంక మ్యాచ్ లో ఇన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయా…

రన్ మిషన్ గా పేరుపొందిన విరాట్ కోహ్లీ శ్రీలంక టీమ్ మీద ఇప్పటివరకు 4000 రన్స్ పూర్తి చేసుకున్న రెండవ ఇండియన్ ప్లేయర్ గా ఒక అరుదైన రికార్డును సాధించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2023 / 08:00 AM IST

    Odi World Cup 2023

    Follow us on

    Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా శ్రీలంకని చిత్తుగా ఓడించి సెమీఫైనల్ కి క్వాలిఫై అయింది. ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్ ల్లో 7 విజయాలను అందుకొని అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఇండియన్ టీం ఈరోజు శ్రీలంక టీం మీద 302 పరుగుల తేడా తో భారీ విజయాన్ని దక్కించుకొని ఇండియన్ టీం సత్తాని మరొకసారి ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసింది. ఈ మ్యాచ్ లో కొన్ని అద్భుతమైన రికార్డులు కూడా నమోదు అయ్యాయి. అవి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ఈ వరల్డ్ కప్ లో ఇండియన్ టీం 302 పరుగుల భారీ విజయాన్ని అందుకొని సెమీఫైనల్ లోకి ఎంటర్ అయింది…

    ఇక ఒకే సంవత్సరంలో శ్రీలంక ని వన్డే ల్లో వరుసగా రెండుసార్లు 100 లోపే ఆలౌట్ చేసిన టీం గా ఇండియా ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేసింది..

    రన్ మిషన్ గా పేరుపొందిన విరాట్ కోహ్లీ శ్రీలంక టీమ్ మీద ఇప్పటివరకు 4000 రన్స్ పూర్తి చేసుకున్న రెండవ ఇండియన్ ప్లేయర్ గా ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఇక మొదటి ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు శ్రీలంక మీద 5108 రన్స్ చేశాడు…

    ఇక ఇప్పటివరకు జరిగిన మొత్తం వరల్డ్ కప్పుల్లో ఇండియా తరఫున 13 సార్లు 50 ప్లస్ రన్స్ చేసి విరాట్ కోహ్లీ రెండో పొజిషన్ లో కొనసాగుతున్నాడు. సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు 50 పరుగులకి పైన 21సార్లు సాధించడం జరిగింది…

    ఒకే సంవత్సరంలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ గా కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేశాడు. దీంతో ఓకే క్యాలెండరు ఇయర్ లో 1000 అంతకంటే ఎక్కువ రన్స్ చేశాడు.కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ ఏడుసార్లు ఈ రికార్డుని క్రియేట్ చేస్తే విరాట్ కోహ్లీ, సచిన్ రికార్డును బ్రేక్ చేసి 8 సార్లు ఈ రికార్డ్ ను సాధించిన ప్లేయర్ గా కోహ్లీ హిస్టరీలో నిలిచాడు.

    రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా టీం న్యూజిలాండ్ మీద 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక ఇండియా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో 302 పరుగుల తేడా తో ఈ వరల్డ్ కప్ లో ఇండియా ఒక అరుదైన రికార్డు అనేది క్రియేట్ చేసింది…

    ఇక ఇవాళ్ల జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా స్కోర్ 357 కాగా, ఏ ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయలేదు. ఈ లెక్కన ఏ ఒక్క ప్లేయర్ సెంచరీ చేయకుండానే 357 లాంటి అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ టీం గా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది…

    వరల్డ్ కప్ లో ఒక ఇన్నింగ్స్ లో 6 సిక్స్ లు కొట్టిన రెండవ ప్లేయర్ గా శ్రేయస్ అయ్యర్ ఒక అరుదైన రికార్డ్ ని సాధించాడు. శ్రేయాస్ అయ్యర్ కంటే ముందు కపిల్ దేవ్, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు…

    ఒక మ్యాచ్ లో అత్యధిక రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్ గా దిల్షాన్ మధుశంక పేరు మీద ఒక రికార్డు అనేది క్రియేట్ అయింది. ఇక ఈ క్రమం లో 80 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు ఇక ఇదే క్రమంలో మొదటి ప్లేస్ లో ఇంగ్లాండ్ కి చెందిన అదిల్ రషీద్ ఉన్నాడు. ఈయన 85 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు… వీళ్ళిద్దరూ ఐదు వికెట్లు తీసి మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్లుగా మిగిలిపోయారు…

    ఇక మొత్తం వరల్డ్ కప్ లో మహమ్మద్ షమీ మూడుసార్లు 5 వికెట్లు తీసిన రెండవ ప్లేయర్ గా ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ ఉన్నాడు…

    ఇక ఇండియన్ టీమ్ ఇవాళ్ల 302 పరుగుల తేడా తో మంచి విజయం సాధించి ఫోర్త్ బిగ్గెస్ట్ విజయంగా గుర్తింపు పొందింది…

    ఇక వరుసగా మూడు సార్లు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలరు గా షమీ ఒక రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు…

    ఇక ఇప్పటివరకు వరల్డ్ కప్ లో మొదట మ్యాచ్ లకి దూరమైన మహమ్మద్ షమి వరుసగా మూడు మ్యాచ్ లు ఆడి అందులో 14 వికెట్లను తీశాడు.దీంతో వరల్డ్ కప్ లో జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ ఇద్దరూ వరల్డ్ కప్ లో 44 వికెట్లు తీశారు.కానీ ప్రస్తుతం షమీ ఈ రికార్డును బ్రేక్ చేస్తూ వరల్డ్ కప్ లో 45 వికెట్లు తీసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు…