Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: బయట నీ ముఖాన ఊస్తున్నారంటూ రతికపై అమర్ దాడి! కెప్టెన్సీ టాస్క్ లో ఊహించని ట్విస్ట్స్!

సంచులు క్రింద ఎందుకు పడేశావ్ అని రతిక అమర్ ని ప్రశ్నించింది. అది నా ఇష్టం, నా స్ట్రాటజీ అడగటానికి నువ్వెవరు అన్నాడు అమర్. ఎదవ పనులు చేసి స్ట్రాటజీలు అనడం సరికాదని రతిక అమర్ మీద ఫైర్ అయ్యింది.

Written By: NARESH, Updated On : November 3, 2023 7:55 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్స్ నడుస్తున్నాయి. ఇంటి సభ్యులను వీరసింహాలు, గర్జించే పులులు అనే రెండు టీమ్స్ గా విభజించాడు. శివాజీ, అర్జున్, అమర్ దీప్, ప్రియాంక, అశ్విని, పల్లవి ప్రశాంత్ గర్జించే పులులు టీమ్ లో ఉన్నాడు. వీర సింహాలు టీమ్ లో గౌతమ్, శోభా, తేజ, యావర్, భోలే, రతిక ఉన్నారు. ఈ రెండు టీమ్స్ సమయానుసారంగా గార్డెన్ ఏరియాలో ఉన్న పైపు నుండి క్రిందపడే బాల్స్ సేకరించాలి.

అదే సమయంలో బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో పాల్గొనాలి. జంపింగ్ జపాంగ్ టాస్క్ లో గర్జించే పులులు టీమ్ పై వీరసింహాలు టీమ్ విజయం సాధించింది. వీర సింహాలు టీమ్ కి ఒక పవర్ దక్కింది. దాంతో ప్రత్యర్థి టీమ్ నుండి ఒక ప్లేయర్ ని డెడ్ చేయవచ్చని బిగ్ బాస్ చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ని డెడ్ చేశారు. ఇక గురువారం ఎపిసోడ్లో బాల్స్ సేకరించే సమయంలో రతిక-అమర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

సంచులు క్రింద ఎందుకు పడేశావ్ అని రతిక అమర్ ని ప్రశ్నించింది. అది నా ఇష్టం, నా స్ట్రాటజీ అడగటానికి నువ్వెవరు అన్నాడు అమర్. ఎదవ పనులు చేసి స్ట్రాటజీలు అనడం సరికాదని రతిక అమర్ మీద ఫైర్ అయ్యింది. అమర్ కూడా తగ్గలేదు. ఎదవ పనులు చేసేది నువ్వు. బయట నీ ముఖాన ఊస్తున్నారు, అన్నాడు. మాటలు జాగ్రత్తగా రాని అని రతిక అన్నది. నువ్వు బెదిరిస్తే బెదిరిపోతానా? పక్కకెళ్లి ఆడుకో అంటూ అమర్ కౌంటర్ వేశాడు.

అనంతరం బిగ్ బాస్ మరో టాస్క్ పెట్టాడు. ‘బ్రేక్ ఇట్ ఎయిమ్ లో ‘ అనే టాస్క్ లో ఇరు టీమ్స్ నుండి ఏక కాలంలో ఇద్దరు పాల్గొనాలి. ఎవరు ముందుగా టాస్క్ పూర్తి చేస్తే ఆ టీమ్ విజయం సాధిస్తుందని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో గర్జించే పులులు టీమ్ నుండి అర్జున్, అమర్ పాల్గొన్నారు. వీర సింహాలు టీమ్ నుండి గౌతమ్, శోభా పాల్గొన్నారు. అర్జున్-అమర్ ముందుగా టాస్క్ పూర్తి చేసి విన్ అయ్యారు. దాంతో గర్జించే పులులు టీమ్ కి పవర్ దక్కింది.

ఆ పవర్ తో ప్రత్యర్థి వీర సింహాలు టీమ్ నుండి ఒకరిని డెడ్ చేయవచ్చు లేదా 500 బాల్స్ తీసుకోవచ్చు అన్నారు. 500 బాల్స్ తీసుకునే ఆప్షన్ ఎంచుకున్నారు. అనంతరం గోల్డెన్ బాల్ ఏ టీమ్ వద్ద ఉందని బిగ్ బాస్ అడిగాడు. వీర సింహాలు తమ వద్ద ఉందని చెప్పాడు. ఆ కారణంగా వారికి మరో పవర్ దక్కింది. సదరు పవర్ తో తమ లోని వీక్ ప్లేయర్ ని ప్రత్యర్థి టీమ్ లోని స్ట్రాంగ్ ప్లేయర్ తో స్వాప్ చేయవచ్చు అన్నారు. భోలే ని ఇటు పంపి అర్జున్ ని తమ టీం లోకి వీర సింహాలు తీసుకున్నారు. ఇలాంటి ఆసక్తికర విషయాలతో ఎపిసోడ్ ముగిసింది.