India Vs South Africa: సౌతాఫ్రికా తో ఇండియన్ టీం ఆడుతున్న టి20 సిరీస్ లో భాగంగా మొన్న జరగాల్సిన మొదటి టి20 మ్యాచ్ రద్దయింది. ఇక దాంతో ఇప్పుడు రెండోవ టి 20 మ్యాచ్ జరగబోతుంది. ఇక దీనికి ఆల్మోస్ట్ ఇంతకుముందు మొదటి 20 మ్యాచ్ లో ఏ జట్టుతో అయితే ఇండియన్ టీమ్ బరి లోకి దిగాలనుకుందో ఈ మ్యాచ్ లో కూడా అదే టీమ్ ని బరిలోకి దించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో చాలామంది ప్లేయర్లకు అన్యాయం జరగబోతుంది. ఎందుకంటే అందరూ కూడా మంచి ఫామ్ లో కనబడుతూ తమదైన రీతిలో అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడుతున్నప్పటికీ అందరికీ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం అయితే రాదు అందువల్ల కొంతమంది ప్లేయర్లకి అన్యాయం జరుగుతుంది.
ముఖ్యంగా శ్రేయస్ అయ్యార్ మంచి ఫామ్ లో ఉండడం వల్ల అతని రీప్లేస్ మెంట్ చేసే ప్లేయర్ అయిన తిలక్ వర్మ కి ఆడే అవకాశం రాదు. నిజానికి తిలక్ వర్మ కూడా అద్భుతమైన సత్తా ఉన్న ప్లేయర్ అయినప్పటికీ టీం లో ప్రస్తుతానికి ఆడే అవకాశం అయితే లేదు ఇక రుతురాజ్ గైక్వాడ్ విషయం కూడా అలాగే ఉంది.వాషింగ్టన్ సుందర్ విషయం కూడా అలాగే ఉంది. ఇలా ప్రతి ఒక్క ప్లేయర్ కి కూడా రీప్లేస్ చేసే ప్లేయర్లు ఉన్నప్పటికీ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉండటం వల్ల ఎవరిని తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ చాలా చర్చనీయాంశం గా మారింది.అయితే ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇక ఇలాంటి సందర్భంలో తమదైన సత్తా చాటుతూ ఇండియన్ టీమ్ ఈ సిరీస్ ని కూడా గెలుపొందాలనే ఆశతో ఉంది. కాబట్టి ఈ సీరీస్ ని గెలవడానికి కావాల్సిన కసరత్తులన్నిటిని చేస్తున్నారు. అయితే ఎక్కువమంది ప్లేయర్లు ఫామ్ లో ఉండడం వల్ల ఒక మ్యాచ్ లో కొంతమందిని మరొక మ్యాచ్ లో కొంతమందిని టెస్ట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి మరి ఏ మ్యాచ్ కి ఎవరు అవలబుల్ లో ఉంటారు అనేది…
నిజానికి మొన్న ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్ లో కొంతమంది ప్లేయర్ లను బెంచ్ కే పరిమితం చేశారు .ఇక ఇప్పుడు కూడా అలానే చేస్తారా లేక వాళ్లందరికి అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది..ఇక ఏది ఏమైనా కూడా ఈ సీరీస్ మొత్తాన్ని టి 20 వరల్డ్ కప్ ను దృష్టి లో ఉంచుకొని ఆడితే బాగుంటుంది…