Homeక్రీడలుIndia Vs South Africa Series: మూడు ఫార్మాట్లకి ముగ్గురు కెప్టెన్లు...అసలు బీసీసీఐ ప్లాన్ ఏంటి..?

India Vs South Africa Series: మూడు ఫార్మాట్లకి ముగ్గురు కెప్టెన్లు…అసలు బీసీసీఐ ప్లాన్ ఏంటి..?

India Vs South Africa Series: 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇండియా ఓడిపోవడంతో ప్రస్తుతం ఇండియన్ టీం కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అలాగే టీమ్ ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అనే విషయం మీద అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా మీద ఆడుతున్న టి20 సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు జరగబోయే సౌతాఫ్రికా సీరీస్ కోసం ఎవర్ని టీం లోకి కెప్టెన్ గా తీసుకోవాలి అనే దానిపైన బీసీసీఐ రకరకాల చర్చలను జరిపి మొత్తానికి మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను సెలెక్ట్ చేసింది. అందులో భాగంగానే టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్ కి వ్యవహరించగా, వన్డేల్లో కేఎల్ రాహుల్, టి20 లో సూర్య కుమార్ యాదవ్ ని కెప్టెన్లుగా నియమించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది…ఇక అందులో భాగంగానే ఈ మూడు ఫార్మాట్లకు మూడు టీం లను కూడా ప్రకటించింది. ఒకసారి మూడు ఫార్మాట్ లలో ఉన్న టీమ్ మెంబర్స్ ని కనక చుసుకున్నటైతే…

టి 20 ల్లో
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్ గైక్వాడ్,ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్‌ అయ్యర్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌, ముకేశ్‌ కుమార్, దీపక్ చాహర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి ప్లేయర్ల ను సెలెక్ట్ చేశారు.ఇక ఈ టీమ్ లో అందరూ యంగ్ ప్లేయర్లు ఉండటం విశేషం…ఇక బిసిసిఐ కూడా 2024 లో జరిగే టి 20 వరల్డ్ కప్ ని దృష్టి లో పెట్టుకొని టీమ్ ని సెలెక్ట్ చేస్తుంది.అందుకే బిసిసిఐ ప్లేయర్లందరిని టెస్ట్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…

ఇక వన్డేలకు కూడా ఇండియన్ టీమ్ కొత్త కెప్టెన్ ని తీసుకోవడం అనేది ఇప్పుడు చర్చ నియాంశం గా మారింది.రుతురాజ్‌ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్‌ వర్మ, రజత్ పటీదార్, రింకు సింగ్, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహల్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, యజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్‌, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్ లాంటి ప్లేయర్లతో ఈ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక మొత్తానికి సంజు శాంసన్ కి మళ్ళీ టీమ్ లో చోటు కల్పించడం అనేది మంచి విషయం అనే చెప్పాలి…

ఇక టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్‌ గా తీసుకోవడం శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్‌), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్, సిరాజ్‌, షమీ, బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిధ్ కృష్ణ లాంటి ప్లేయర్ల తో సౌతాఫ్రికా మీద ఇండియన్ టీమ్ కప్పు కొట్టడానికి రెడీ అవుతుంది…

డిసెంబర్‌ 10వ తేదీన తొలి టీ20 మ్యాచ్ తో సౌతాఫ్రికా తో సీరీస్ లు స్టార్ట్ అవుతున్నాయి ఇక ఇలా వరుసగా టి 20, వన్డే, టెస్ట్ సీరీస్ లు ఆడాల్సి ఉంది.ఇక ఇందులో ఇండియన్ టీమ్ తన సత్తా చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version