IND Vs SA: అది మామూలు బ్యాటింగ్ కాదు. టెస్టులలో టి20 అనుకోవచ్చు.. ఎటువంటి బంతివేసిన సరే సమర్థవంతంగా ఆడుతున్నాడు. ఎనిమిదో వికెట్ నెంబర్ లో వచ్చిన అతడు చూస్తుండగానే హాఫ్ సెంచరీ చేశాడు. సిరాజ్ నుంచి మొదలుపెడితే కులదీప్ వరకు ఎవరిని వదిలిపెట్టలేదు.. ఆరు ఫీట్ల ఏడు ఇంచుల ఎత్తులో ఉన్న అతడు.. గుహవాటి మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. టి20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ టీమ్ ఇండియా బౌలర్లకు కన్నీరు మిగిల్చాడు.
431 పరుగుల వద్ద ముత్తుస్వామి (109) వికెట్ ను దక్షిణాఫ్రికా కోల్పోయింది. 97 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఈ వికెట్ కోల్పోయిన తర్వాత దక్షిణాఫ్రికా త్వరగానే మిగతా వికెట్లు కూడా కోల్పోతుందని అందరూ అనుకున్నారు. కానీ జాన్సన్ స్క్రిప్ట్ మరో విధంగా ఉంది. దీంతో దక్షిణాఫ్రికా కు యధావిధిగా పరుగులు వచ్చాయి. పైగా ముత్తుస్వామి ఆడిన తర్వాత జాన్సన్ మరింత దూకుడు పెంచాడు.. చూస్తుండగానే హాఫ్ సెంచరీ చేసిన అతడు.. సెంచరీ వైపు అడుగులు వేస్తున్నాడు.. టీమిండియా బౌలర్లకు కన్నీరు తెప్పిస్తున్నాడు.. ఐదు ఫీట్ల ఏడు ఇంచుల ఎత్తులో ఉండే అతడు అత్యంత సులువుగా సిక్సర్లు కొట్టాడు. ఈ కథనం రాసే సమయం వరకు జాన్సన్ 74 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో నాలుగు బౌండరీలు, ఏడు సిక్సర్ లు ఉండడం విశేషం.
హార్మర్ తో కలిసి తొమ్మిదవ వికెట్ కు జాన్సన్ 31 పరుగులు జోడించాడు అంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు జాన్సన్ ఎనిమిదో స్థానంలో వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ లు చాలా ఆడాడు. అందులో 2023లో సెంచూరియన్ వేదికగా ఇండియాతో జరిగిన మ్యాచ్లో 84 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో 78*(ఈ కథనం రాసే సమయం వరకు) పరుగులు చేశాడు.. కెప్ టౌన్ వేదికగా 2025లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 62, 2022లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 59, 2022లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 48 పరుగులు చేశాడు. 6 ఫీట్ల ఏడు అడుగుల ఎత్తులో ఉండే జాన్సన్ బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు. ముఖ్యంగా అతడి ఫుట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది.. జడేజా బౌలింగ్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన తీరు.. అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపిస్తోంది.