Ram Charan: గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్… ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలకు అందనటువంటి గొప్ప క్రేజ్ ను దక్కించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. తనకంటూ ఒక గొప్ప ఐడెంటిటీని తీసుకురావడంలో చాలా వరకు హెల్ప్ అయ్యాయి… రామ్ చరణ్ లాంటి హీరోతో ఒక స్టార్ డైరెక్టర్ సినిమా చేయాలనే ప్రణాళికలు చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. కాంతార సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న రిషబ్ శెట్టి రామ్ చరణ్ హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక రీసెంట్ గా అతనికి కథను వినిపించినప్పటికి ప్రస్తుతం రామ్ చరణ్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయడానికి చాలా లేట్ అవుతుందని చెప్పారు. దాంతో ఆయన వేరే హీరో దగ్గరికి తన కథను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికైతే రిషబ్ శెట్టి చెప్పిన కథ అతని నచ్చలేదట.
అందుకోసమే సినిమాల్లో బిజీగా ఉన్నానని రామ్ చరణ్ చెప్పినట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. రిషబ్ శెట్టి సైతం ఈ కథని వేరే హీరోతో చేస్తాడా? లేదంటే వేరొక సినిమా స్టోరీ తో మరోసారి రామ్ చరణ్ దగ్గరికి వెళ్తాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమాలతో వాళ్ళు ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి రిషబ్ శెట్టి లాంటి దర్శకుడు ఇప్పుడు యాక్టింగ్ మీదకంటే డైరెక్షన్ మీద కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక డైరెక్టర్ గా ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
ప్రస్తుతం రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ అనే సినిమాలో హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సైతం తను చాలా కొత్తగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. హనుమంతుడి పాత్రను ఇప్పటివరకు చేయలేదని అది చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుందని తను గతంలో వివరించినట్లుగా తెలుస్తోంది…