Errabelli Dayakar And Brahmanandam: బ్రహ్మానందం.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ పేరును.. తెలుగు సినీ అభిమానులకు ఈ వ్యక్తిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వందల కొద్ది సినిమాలు చేసి.. తన హాస్యంతో కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు బ్రహ్మానందం. కేవలం నటుడుగా మాత్రమే కాకుండా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా బ్రహ్మానందం సుపరిచితులు. పైగా వెంకటేశ్వర స్వామి, రాముడు చిత్రాలను వేస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.
బ్రహ్మానందం సినిమాల్లో ఏ స్థాయిలో అయితే కామెడీ పంచుతారో.. నిజ జీవితంలో కూడా అదే స్థాయిలో హాస్యాన్ని పండిస్తారు. ఆయన ఎటువంటి కార్యక్రమాలకు వెళ్ళినా సరే తనదైన కామెడీతో అందరిని నవ్విస్తారు. ఎంతో సరదాగా.. హుందాగా ఉండే బ్రహ్మానందం ఇప్పుడు వార్తల్లో వ్యక్తయ్యారు. ఆయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి గులాబీ పార్టీ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా హాజరయ్యారు. బ్రహ్మానందం ఆ కార్యక్రమానికి వస్తుండగా అప్పటికే అక్కడ ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. బ్రహ్మానందానికి స్వాగతం పలికారు. అంతేకాదు తనతో ఒక ఫోటో దిగాలని దయాకర్ రావు కోరగా బ్రహ్మానందం తిరస్కరించారు. “అన్నా ఒక ఫోటో ప్లీజ్ అని దయాకర్ రావు రిక్వెస్ట్ చేస్తే.. ఇప్పుడు కాదు ఎల్లెహే” అంటూ బ్రహ్మానందం ముందుకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు.. ఎర్రబెల్లి దయాకర్ రావు పరువు పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు గులాబీ కార్యకర్తలు ఇదే స్థాయిలో స్పందిస్తున్నారు. దయాకర్ రావు, బ్రహ్మానందానికి మంచి స్నేహం ఉందని.. అందువల్లే బ్రహ్మానందం ఇలా రెస్పాండ్ అయ్యారని పేర్కొంటున్నారు. ఈ వీడియోను నెగిటివ్ ప్రచారం కోసం వాడుకోవద్దని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఆగడం లేదు. మొత్తానికి బ్రహ్మానందం చేసిన ఈ పని ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక ఆయుధం లభించింది. అది కూడా దయాకర్ రావుకు వ్యతిరేకంగా..
ఎల్లేహే
అన్నా అన్నా ఒక్క ఫోటో ప్లీజ్ అని బ్రహ్మానందంని బతిలాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎల్లేహే అని పక్కకి నెట్టిన బ్రహ్మానందం pic.twitter.com/HJGhteZnMx
— Tharun Reddy (@Tarunkethireddy) November 23, 2025