India Vs South Africa Final: టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, విరాట్.. కారణం అదేనా?

ఇండియా టి20 వరల్డ్ కప్ గెలవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. విరాట్ ముందుగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తే.. ఆ తర్వాత రోహిత్ తన మనసులో మాటను బయటకు చెప్పేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 30, 2024 10:17 am

India Vs South Africa Final

Follow us on

India Vs South Africa Final: టి20 వరల్డ్ కప్ లో 10 సంవత్సరాల తర్వాత టీమిండియా తుది అంచె లోకి వెళ్ళింది. 2014లో ఫైనల్ వెళ్ళినప్పటికీ.. శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి ఆ తప్పును పునరావృతం చేయకూడదని బలంగా నిశ్చయించుకుంది. 2007 తర్వాత మరోసారి టీమిండియా టి20 వరల్డ్ కప్ నెగ్గలేదు. రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఓడిపోయింది. ఈసారి ఎలాగైనా ఫైనల్లో గెలిచి ఆ అపప్రదను తొలగించుకోవాలని రోహిత్ బలంగా అనుకున్నాడు. అయితే జాతీయ మీడియా మాత్రం ఈ టి20 వరల్డ్ కప్ నెగ్గితే రోహిత్, విరాట్ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెబుతారని కథనాలను ప్రసారం చేసింది. అయితే ఆ వార్తలన్నీ ఊహగానాలని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో కొట్టి పారేశారు. అయినప్పటికీ వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారని.. కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తారని కొన్ని స్పోర్ట్స్ సైట్లు కూడా వార్తలు రాశాయి.. దీంతో ఫైనల్ మ్యాచ్ పై విపరీతమైన ఆసక్తి పెరిగింది.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మైదానంపై టాస్ గెలిచిన జట్టే గెలుస్తుందని ఓ సెంటిమెంట్ ఉండటంతో.. దాదాపు ప్రేక్షకులు కూడా టీమ్ ఇండియా గెలుస్తుందని ఒక అంచనాకు వచ్చారు.. ఓపెనర్లు గా మైదానంలోకి దిగిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్వేచ్ఛగానే బ్యాటింగ్ చేశారు. జట్టు స్కోరు 23 పరుగుల వద్దకు రాగానే.. వ్యక్తిగత స్కోర్ తొమ్మిది పరుగుల వద్ద రోహిత్ శర్మ వేగంగా ఆడే క్రమంలో ఆడిన షాట్ మిడ్ ఆన్ లో లేచింది. దానిని క్లాసెన్ అత్యంత ఒడుపుగా పట్టాడు. దీంతో రోహిత్ నిరాశగా మైదానాన్ని వీడాడు. ఇక విరాట్ ఈ మ్యాచ్లో తన పూర్వపు ఫామ్ అందుకున్నాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.. చివరికి ఉత్కంఠ మధ్య భారత్ దక్షిణాఫ్రికా పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండవసారి t20 వరల్డ్ కప్ దక్కించుకుంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల సరసన నిలిచింది.

ఇక ఇండియా టి20 వరల్డ్ కప్ గెలవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. విరాట్ ముందుగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తే.. ఆ తర్వాత రోహిత్ తన మనసులో మాటను బయటకు చెప్పేశాడు..” టి20 అనేది వేగవంతమైన ఆటకు చిరునామా. సుదీర్ఘ కాలంగా ఈ ఫార్మాట్లో ఆడుతున్నా. ఇక యువకులకు అవకాశం కల్పించాలి. వారు వేగంగా ఆడుతుంటే చూడాలి. టీమిండియా మరిన్ని విజయాలు సాధించాలి. కొత్త తరం వస్తేనే ఆటకు అందం ఉంటుందని” టి20కి రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇక రోహిత్ కూడా ట్రోఫీ అందుకున్న తర్వాత.. మ్యాచ్ ఎలా గెలిచాం? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం? ఎలాంటి ప్రణాళికలు రూపొందించాం? అనే విషయాలపై స్పష్టంగా మాట్లాడాడు. ఆ తర్వాత తన మనసులో ఉన్న మాటను చెప్పేశాడు. టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నట్టు వెల్లడించాడు. ” 15 ఏళ్లుగా పొట్టి ఫార్మాట్ ఆడుతున్నాను. ఎన్నో గెలుపోటములు చూశాను. ఒక కెప్టెన్ గా టీమిండియా కు t20 వరల్డ్ కప్ మరోసారి అందించాను. ఇంతకంటే గొప్ప ఘనత ఏముంటుంది? ఈ ఆనందంలోనే పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నాను. యువకులకు అవకాశాలు కల్పించాలి. వారు వేగంగా ఆడుతుంటే చూడాలి. అప్పుడే బాగుంటుందని” రోహిత్ వ్యాఖ్యానించాడు. అయితే విరాట్, రోహిత్ టి20 ఫార్మాట్ నుంచి వై దొలిగిన నేపథ్యంలో సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఆ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు ఒకే శాలువా కప్పి.. టీమిండియా క్రికెటర్లు సన్మానం చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.