Homeక్రీడలుక్రికెట్‌India Vs South Africa 4th T20: ఇద్దరు బ్యాటర్ల శతకాలు.. గెలుపు తేడా 135...

India Vs South Africa 4th T20: ఇద్దరు బ్యాటర్ల శతకాలు.. గెలుపు తేడా 135 పరుగులు.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ఎన్ని రికార్డులు సాధించిందంటే..

India Vs South Africa 4th T20: ఈ మ్యాచ్లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచిన సూర్య కుమార్ యాదవ్ మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్ లో భారత జట్టు అన్ని మ్యాచ్ లలోనూ ముందుగా బ్యాటింగ్ చేసింది. రెండవ టి20 మ్యాచ్ మినహా.. మిగతా అన్నింటిలోనూ భారత జట్టుకే అనుకూలంగా ఫలితం వచ్చింది. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20వ వార్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (36) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ సంజు శాంసన్ (109*), తిలక్ వర్మ (120*) అదరగొట్టారు. రెండో వికెట్ కు అజేయంగా 210 పరుగులు జోడించారు. ఫలితంగా టీమ్ ఇండియా దారి లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. 284 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ టార్గెట్ ను చేజ్ చేసేలా కనిపించలేదు. జట్టు స్కోరు ఒక్క పరుగు వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ రిజా హెండ్రిక్స్(0) అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (1) హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో సంజుకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ మార్క్రం (8) ను అర్ష్ దీప్ బోల్తా కొట్టించాడు. ప్రమాదకరమైన క్లాసెన్(0) అర్ష్ దీప్ బౌలింగ్ లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు పది పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో జట్టు కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే ఈ దశలో వచ్చిన స్టబ్స్(43), మిల్లర్(36) అయితే వికెట్ కు 86 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని వరుణ్ చక్రవర్తి విడదీశాడు. వరుణ్ బౌలింగ్లో మిల్లర్ తిలక్ వర్మతో క్యాచ్ ఇచ్చే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జాన్సన్ వచ్చాడు. 12 బంతులు ఎదుర్కొని 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టబ్స్ కూడా 43 పరుగుల వద్ద రవి బిష్ణోయ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక మిగతా ఆటగాళ్లు ఇలా వచ్చే అలా వెళ్లిపోవడంతో.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 148 పరుగుల వద్ద ముగిసింది. టీమ్ ఇండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు. హార్దిక్ పాండ్యా, రమణ్ దీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.

రికార్డులు బద్దలయ్యాయి

ఈ మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా అనే రికార్డులను బద్దలు కొట్టింది. పరుగులపరంగా (135) దక్షిణాఫ్రికా జట్టుతో అతిపెద్ద ఓటమిని అందించింది. భారత జట్టుకు పరుగులపరంగా ఇది మూడవ అతి భారీ విజయం. ఇదే మైదానంపై 2023లో టీమిండియా దక్షిణాఫ్రికా పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక 2023లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ను ఆస్ట్రేలియా 111 పరుగుల తేడాతో ఓడించింది. 2020లో జొహెన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా పై 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.

స్పిన్నర్ల హవా

ఈ సిరీస్ లో భారత స్పిన్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చూపించారు. డర్బన్ లో జరిగిన మ్యాచ్లో 9 ఓవర్లు వేసి 61 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టారు. 6.77 ఎకానమీ నమోదు చేశారు. గ్కె బెర్హా వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో 9 ఓవర్లు బౌల్ చేసిన స్పిన్నర్లు 40 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టారు. 4.44 ఎకనామీ నమోదు చేశారు.. సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో 12 ఓవర్లు బౌల్ చేసి 116 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. 9.66 ఎకనామీ నమోదు చేశారు. జోబర్గ్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్లో 9 ఓవర్లు బౌల్ చేసి 76 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టారు. 8.44 ఎకానమీ నమోదు చేశారు..

విజయాలపరంగా

ఇక విజయాలపరంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికాపై భారత జట్టుకు ఇది 18వ t20 విజయం. సౌత్ ఆఫ్రికా పై భారత్ ఇప్పటి వరకు 31 t20 లు ఆడింది. ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా రికార్డును కూడా టీం ఇండియా బద్దలు కొట్టింది. దక్షిణాఫ్రికా పై ఇప్పటివరకు ఆస్ట్రేలియా 25 t20 మ్యాచ్ లు ఆడగా.. 17 విజయాలను సొంతం చేసుకుంది.

మూడోసారి 250 కి పైగా పరుగులు

పురుషుల టి20 లో 250+ పైగా పరుగులను మూడుసార్లు చేసిన జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. సంజు, తిలక్ వర్మ రెండో వికెట్ కు నెలకొల్పిన 210* పరుగుల భాగస్వామ్యం.. టి20 లో ఏ వికెట్ కైనా భారత జట్టు తరుపున ఇదే అత్యుత్తమం.
ఐసీసీ ఫుల్ టైం టీమ్స్ లో ఒక జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు(సంజు 109*, తిలక్ వర్మ 120*) సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు ఒక సిరీస్ లో నాలుగు సెంచరీలు నమోదు కావడం ఇదే ప్రథమం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular