T20: Ind vs SA సూరీడు.. ఈరోజు ఏం చేస్తావయ్యా..?

ముఖ్యంగా ఓపెనర్లు మంచి పర్ఫామెన్స్ కనక ఇచ్చినట్లయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. జొహన్నెస్‌బర్గ్‌ వేదిక మీద ఇండియన్ టీం కి కూడా మంచి రికార్డు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే విజయం సాధించి సత్తా చాటాలని మన ప్లేయర్లు చూస్తున్నారు.

Written By: Gopi, Updated On : December 14, 2023 1:42 pm
Follow us on

Ind vs SA: ఇండియా సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టి 20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఇంకా ఈ మ్యాచ్ లో కూడా సౌతాఫ్రికా విజయం సాధించి తన సత్తాని చూపించుకొని చూస్తుంది. అయినప్పటికీ ఇండియన్ టీం ఏ మాత్రం తగ్గకుండా మూడో టి20 మ్యాచ్ లో విజయం సాధించి తనదైన సత్తా చాటాలని చూస్తుంది. ఇక ఈ ఆధిపత్య పోరు లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.ఇక ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధిస్తే సీరీస్ సమం అవుతుంది. లేదంటే మాత్రం సౌతాఫ్రికా ఈ కప్పును ఎగరేసుకుపోతుంది. ఇక ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ లో గెలవాలంటే మన ప్లేయర్లు మంచి పర్ఫామెన్స్ ని ఇవ్వాలి.

ముఖ్యంగా ఓపెనర్లు మంచి పర్ఫామెన్స్ కనక ఇచ్చినట్లయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. జొహన్నెస్‌బర్గ్‌ వేదిక మీద ఇండియన్ టీం కి కూడా మంచి రికార్డు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే విజయం సాధించి సత్తా చాటాలని మన ప్లేయర్లు చూస్తున్నారు.ఇక అందులో భాగంగానే సూర్య కుమార్ యాదవ్ కీలకమైన మార్పులు చేస్తూ ప్లేయర్లను బరిలోకి దింపబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ మ్యాచ్ లో మాత్రం విజయం మనం సాధించాలనే ఉద్దేశ్యం తో ప్లేయర్లలో ఒక స్పిరిట్ నింపినట్టు గా తెలుస్తుంది.ఇక ఈ మ్యాచ్ లో కనక ఇండియా విజయం సాధిస్తేనే ఇండియన్ టీం పరువు పోకుండా ఉంటుంది. అలాగే ప్లేయర్ల యొక్క స్టామినా ఏంటో కూడా ప్రపంచ దేశలందరికి తెలుస్తుంది.

కాబట్టి మన యంగ్ ప్లేయర్లు టీమ్ లో సీనియర్ ప్లేయర్లు లేకపోయిన కూడా తమదైన రీతిలో మ్యాచ్ లను ఆడుతూ వరుస విజయాలను అందుకుంటున్నారు అని ఇండియన్ టీం యొక్క గొప్పతనం గురించి ప్రతి టీం కూడా మాట్లాడుకోకుండా ఉండలేదు. అందువల్ల ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సమం చేయాలని భారత్ క్రికెట్ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ ని మన ప్లేయర్లు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు గా తెలుస్తుంది.

ఎందుకంటే మనకి కప్ రాకపోయిన పర్వాలేదు కానీ వాళ్ళకి కప్ ఇవ్వడం అనేది మన చతకానీ తనం అవుతుంది అని ప్లేయర్లు దీనిని చాలా ప్రస్టేజియస్ గా తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది . ఇక ఈ మ్యాచ్ కి వర్షం కూడా కారణం కాబోతున్నట్లు గా తెలుస్తుంది ఈ రోజు కూడా మ్యాచ్ జరిగే సమయం లో వర్షం ఉన్నట్టు గా తెలుస్తుంది…ఇక ఏది ఏమైనా మన ప్లేయర్లు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ని సమం చేస్తారా లేదా సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో గెలిచి సీరీస్ ని సొంతం చేసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది…