https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: గ్రాండ్ ఫినాలేకి అదిరిపోయే ట్విస్ట్స్… గెస్ట్స్ గా మహేష్ బాబుతో పాటు ఆ స్టార్

అయితే ఈ సీజన్ కి డిసెంబర్ 17న ఎండ్ కార్డు పడనుంది. దీంతో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం మేకర్స్ ఎన్నో సర్ప్రైజ్ లు కూడా ఇవ్వబోతున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2023 / 02:22 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో టాప్ 6 ఫైనలిస్టులు ఉన్నారు. వారిలో ఎవరు విన్నర్ అవుతారు అనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. కానీ ప్రజంట్ సోషల్ మీడియా ట్రెండ్ ని బట్టి చూస్తే ప్రశాంత్ గెలుస్తాడని ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఫినాలే వీక్ లో అతనికి బాగా ఓట్లు పడుతున్నాయి. మరో వైపు శివాజీ కూడా విన్ అయ్యే అవకాశం లేకపోలేదు.

    అయితే ఈ సీజన్ కి డిసెంబర్ 17న ఎండ్ కార్డు పడనుంది. దీంతో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం మేకర్స్ ఎన్నో సర్ప్రైజ్ లు కూడా ఇవ్వబోతున్నారు. కాగా గ్రాండ్ ఫినాలే రోజు మాజీ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. కొందరు హీరోయిన్లు డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది.

    కాగా ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ గా వచ్చేది ఎవరు అనే దానిపై కూడా రకరకాల వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఒక న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య బాబు వస్తారని ప్రచారం. తర్వాత కూడా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబును ఈ సీజన్ చీఫ్ గెస్ట్ గా తీసుకుని వస్తున్నట్లు తెలుస్తుంది.

    మహేష్ బాబు తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వస్తున్నట్లు సమాచారం. గత సీజన్ల కంటే ఇది బాగా హిట్ అవడంతో .. దీన్ని గ్రాండ్ గా ముగించాలని హోస్ట్ నాగార్జున పట్టుదలతో ఉన్నారట. అందుకే గెస్ట్ గా వచ్చేందుకు మహేష్ బాబు ను ఒప్పించారు అంటున్నారు. ఇక గుంటూరు కారం ప్రమోషన్స్ లో భాగంగా వచ్చి విజేతకు ట్రోఫీ అందజేస్తారట సూపర్ స్టార్ మహేష్ బాబు.