India Vs South Africa 2nd Test: సౌతాఫ్రికా తో ఆడుతున్న రెండో టెస్టులో భాగంగా ఇండియన్ టీం దారుణమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. మొదట బౌలింగ్ చేసిన ఇండియన్ టీమ్ సౌతాఫ్రికా ను 55 పరుగులకు అలౌట్ చేసింది.ఇక ఇండియన్ టీం బ్యాటింగ్ లో సత్తా చాటుతుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే మన ప్లేయర్లు మొదట మంచి పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చారు.
అయినప్పటికీ 153 పరుగుల వద్ద నాలుగు వికెట్లను కోల్పోయి ఉన్న ఇండియన్ టీమ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే ఆరు వికెట్లను కోల్పోవడం ఇప్పుడు చాలా చర్చలకు దారి తీస్తుంది.బ్యాట్స్ మెన్స్ వరుసగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అవుట్ అయిపోవడం ఏంటి అంటూ పలువురు క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇండియన్ టీం టెస్ట్ క్రికెట్లో ఇంత దారుణమైన పర్ఫామెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు.147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒక్క రన్ చేయకుండా ఆరు వికెట్లు కోల్పోవడం అనేది ఇదే మొదటిసారి.
ఈ చెత్త రికార్డును ఇండియన్ టీమ్ తన ఖాతాలో వేసుకుంది అంటూ పలువురు సీనియర్ క్రికెటర్లు సైతం మన టీమ్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ అనుకుంటున్నారా లేదంటే గల్లి క్రికెట్ అనుకుంటున్నారా అలా ఔట్ అయిపోయారు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు…
టీమిండియా బ్యాట్స్ మెన్స్ చేసిన పరుగులను కనక ఒకసారి మనం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ 59 పరుగులు చేశాడు, శుభ్ మన్ గిల్ 36 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 39 పరుగులు చేశాడు. ఇక వీళ్లు తప్ప మిగిలిన ఏ ప్లేయర్ కూడా అంత పెద్దగా రాణించలేకపోవడంతో ఇండియన్ టీమ్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది…ఇక ఇప్పటికే మొదటి టెస్ట్ ఓడిపోయిన ఇండియన్ టీం ఈ టెస్ట్ ను గెలిస్తేనే సీరీస్ సమం అవుతుంది. లేకపోతే మాత్రం సౌతాఫ్రికా సిరీస్ ని ఎగరేసుకుపోతుంది. ఇక మిగిలిన రోజుల్లో జరిగే ఆటను సక్రమంగా ఆడితే ఇండియన్ టీం మ్యాచ్ ల్లో ఈజీగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇండియన్ ప్లేయర్లు ఈ మ్యాచుల్లో ఏ మేరకు రాణించి ఇండియన్ టీం కి విజయాన్ని అందిస్తారో చూడాలి…