Divi Vadthya: జిమ్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? వైరల్ గా బోల్డ్ లుక్

ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈమె దివ్య వాధ్య. తెలుగు అమ్మాయి అయిన దివ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తనకు సంబంధించిన ప్రతి విషయం షేర్ చేస్తారు. తరచుగా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

Written By: NARESH, Updated On : January 4, 2024 12:27 pm

Divi Vadthya

Follow us on

Divi Vadthya: తారలకు అందమే పెట్టుబడి. ఫిట్ అండ్ స్లిమ్ గా ఉన్నన్నాళ్లే కెరీర్. ఒక్కసారి షేప్ అవుట్ అయితే స్టార్స్ హీరోయిన్స్ ని కూడా దర్శక నిర్మాతలు పట్టించుకోరు. అందుకే కడుపు మాడ్చుకుని డైటింగ్ చేస్తారు. గంటల తరబడి జిమ్ లో చెమటలు చిందిస్తారు. యోగ, మెడిటేషన్ చేస్తారు. ఇక పైన ఫోటోల్లో జిమ్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తించారా? ఈమె మీకు బాగా తెలిసిన నటి. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది.

ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈమె దివ్య వాధ్య. తెలుగు అమ్మాయి అయిన దివ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తనకు సంబంధించిన ప్రతి విషయం షేర్ చేస్తారు. తరచుగా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దివికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. వన్ మిలియన్ కి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. తాజాగా జిమ్ ఫిట్ లో హాట్ ఫోటోలు షేర్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి.

దివి కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా చేసింది. అవి చిన్న సినిమాలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొంది. వెరీ పాప్యులర్ షో కావడంతో దివి గురించి జనాలకు తెలిసింది. సీజన్ 4 లో దివి పర్లేదు అనిపించింది. ఆమె ఎక్కువ వారాలు ఉండలేదు. స్కిన్ షోకి దూరంగా ఉన్న దివి, ఎఫైర్స్ కూడా పెట్టుకోలేదు. అమ్మ రాజశేఖర్ తో ఆమె స్నేహం చేశారు.

మహేష్ బాబు మహర్షి చిత్రంలో దివి క్లాస్ మేట్ రోల్ చేసింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్నాక దివికి ఆఫర్స్ పెరిగాయి. ఆమె పలు చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటిస్తుంది. ఇటీవల కాలంలో దివి నటించిన క్యాబ్ స్టోరీస్, ఏటిఎం అనే సిరీస్లు విడుదలయ్యాయి. అలాగే జిన్నా, రుద్రాంగి చిత్రాల్లో కీలక రోల్స్ చేసింది. నెక్స్ట్ ఆమె పుష్ప 2 మూవీలో న్యూస్ రిపోర్టర్ గా కనిపించనుంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి.