India Vs Pakistan Asia Cup 2025 Final: 41 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆసియా కప్ లో టీమిండియా, పాకిస్తాన్ తొలిసారి ఫైనల్ వెళ్ళాయి. ఈ రెండు జట్లు దాయాది దేశాలు కావడంతో పోటీ ఉత్కంఠగా ఉంటుందని అంచనాలు కొనసాగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇటీవల ఈ రెండు జట్లలో చోటు చేసుకున్న పరిణామాలు విపరీతమైన ఆసక్తిని పెంచుతున్నాయి. అందువల్లే ఫైనల్ మ్యాచ్లో హై వోల్టేజ్ పోరు ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్ ముందు భారత జట్టు గాయాలతో ఇబ్బంది పడుతోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తొడ కండరాలు పట్టేయడంతో ఒక్క ఓవర్కే పరిమితమైపోయాడు. దీంతో అతడు ఫైనల్ లో ఆడటం అనుమానంగా మారింది.. ఈ కథనం రాసే సమయం వరకు కూడా హార్దిక్ పాండ్యా పై ఒక అంచనాకు బౌలింగ్ మార్కెల్ రాలేదని తెలుస్తోంది.. అభిషేక్ సైతం కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు.. అయితే అతడి ఆరోగ్యం బాగానే ఉందని మోర్కెల్ చెబుతున్నాడు. అభిషేక్ శర్మ నుంచి మరొ గట్టి ఇన్నింగ్స్ వస్తేనే టీమిండియా కు లాభం జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు అభిషేక్ శర్మ భీకరమైన ఫామ్ లో ఉండడంతో పాకిస్తాన్ కలవర పడుతోంది. లంకపై శాంసన్, తిలక్ వర్మపై మెరుగైన ప్రాక్టీస్ లభించింది. అయితే బౌలింగ్లో మాత్రం టీమిండియా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు టీమ్ ఇండియా బౌలర్లు ఆడిన మ్యాచ్లలో 60 వికెట్లకు బదులుగా కేవలం 41 వికెట్లు మాత్రమే తీయగలిగారు. యూఏఈ, బంగ్లా జట్లను మాత్రమే ఆల్ అవుట్ చేశారు. చైనా మన్ కులదీప్ యాదవ్ ఇప్పటివరకు 13 వికెట్లు తీసి స్థిరంగా రాణిస్తున్నాడు. అయితే అతడికి అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి నుంచి సహకారం లభించాల్సి ఉంది. బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. అతడి స్థాయికి సరిపోని ప్రదర్శన ఇది. ఫైనల్ లో అతడి నుంచి మెరుగైన బౌలింగ్ ను జట్టు ఆశిస్తోంది. ఒకవేళ అతడి గనుక అదరగొడితే టీమిండియా కు తిరుగుండదు.
ఇక పాకిస్తాన్ కూడా బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతోంది. ఫర్హాన్ మాత్రమే పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఆయుబ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. తలత్, సల్మాన్ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. షహీన్ ఆఫ్రిది మాత్రమే మెరుపులు మెరుపు ఇస్తున్నాడు. పేస్ బౌలర్లు షహీన్, రౌఫ్ అదరగొడుతున్నారు. అయితే వీరు గనక భారత టాపార్డర్ ను ఇబ్బంది పెడితే మ్యాచ్ మీద పాకిస్తాన్ పట్టు బిగించడానికి అవకాశం ఉంటుంది.. సయీమ్ బౌలింగ్లో ఇప్పటివరకు 8 వికెట్లు తీశాడు.
జట్ల అంచనా ఇది
సూర్య కుమార్ యాదవ్ (సారధి), అభిషేక్ శర్మ, గిల్, సంజు శాంసన్, శివం దుబే/ అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, తిలక్ వర్మ.
పాకిస్తాన్: ఫర్హాన్, సల్మాన్ (సారథి), ఫకర్ జమాన్, ఆయుబ్, తలత్, మహమ్మద్ హరీస్, నవాజ్ సూపియాన్, షహీన్ ఆఫ్రిది, రౌఫ్.