India Vs Pakistan Women’s World Cup: మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ ఆదివారం తలపడబోతున్నాయి. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో 59 పరుగులు తేడాతో అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. దీంతో అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది.
మరోవైపు దాయాది పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టుతో తలపడింది. ఏమాత్రం పోటీ ఇవ్వకపోగా.. అత్యంత దారుణంగా ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు ఒక రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆసియా కప్ లో పురుషుల జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్లలో పాకిస్తాన్ జట్టుపై భారత్ విజయం సాధించింది. చివరికి ఫైనల్ మ్యాచ్లో కూడా అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించి ట్రోఫీ సొంతం చేసుకుంది. తద్వారా పాకిస్తాన్ జట్టుపై తన రికార్డును మరింత పటిష్టం చేసుకుంది. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే దారిని అనుసరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పాకిస్తాన్ మహిళల జట్టుపై టీమిండియా మహిళల జట్టుకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పుడు వరకు రెండు జట్ల మధ్య 11 మ్యాచ్లు జరిగాయి. ఒక్కసారి కూడా పాకిస్తాన్ జట్టు విజయం సాధించలేదు. కనీసం పోటీ కూడా ఇవ్వలేదు..
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరిగిన భారత్ అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదికగా మ్యాచులు ఆడింది. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ మహిళల జట్టు భారత్ లో అడుగుపెట్టడం లేదు. భారతదేశంలో పాటు వరల్డ్ కప్ ను నిర్వహిస్తున్న శ్రీలంకలోనే ఈ మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని కొలంబో ప్రేమ దాస మైదానంలో భారత్, పాకిస్తాన్ తలపడబోతున్నాయి.. ఈ రెండు జట్లకు సంబంధించిన మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, జియో హాట్ స్టార్ యాప్ లో లైవ్ లో చూడవచ్చు. ఇక ప్రస్తుతం టీం ఇండియా ప్లేయర్లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. శ్రీలంకపై అద్భుతమైన విజయాన్ని సాధించి అదరగొట్టారు. ఈ లెక్కన చూసుకుంటే పాకిస్తాన్ మీద భారత్ గెలవడం లాంచనమేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.