Spirit Movie Villain: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే నటులు చాలా తక్కువ మంది ఉన్నారు… అలాంటి వాళ్ళలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన చేసిన సలార్, కల్కి లాంటి సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించడంతో ఇప్పుడు రాబోతున్న సినిమాల మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. డిసెంబర్ 5 వ తేదీన రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇక వచ్చే నెల నుంచి సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సర్వసిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో పాలన స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అయిన వివేక్ ఒబెరాయ్ ని విలన్ గా తీసుకోవాలనే ఆలోచనలో సందీప్ ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక అతనితోపాటుగా మడోన్నా సెబాస్టియన్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ న్యూస్ మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
మొత్తానికైతే సందీప్ కనక ఈ సినిమాలో విలన్ గా నటిస్తే మాత్రం ఈ సినిమాకి మంచి హైప్ రావడమే కాకుండా పాన్ ఇండియాలో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వివేక్ ఒబెరాయ్ చేస్తున్న సినిమాలు కూడా చాలా మంచి విజయాలను సాధిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకి కూడా ఆయన చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి…
ఇక సందీప్ మాత్రం మరికొద్ది రోజుల్లో సోనియాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడట. నవంబర్ 5వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని సందీప్ ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…