IND VS NZ Test Match : బెంగళూరును వదలని వర్షం.. తుడిచి పెట్టుకుపోయిన తొలి టెస్ట్ మొదటి సెషన్.. మిగతా ఆటపై కొనసాగుతున్న సందిగ్ధం

అనుకున్నదే జరిగింది. అభిమానుల అనుమానమే నిజమైంది. బెంగళూరులో బుధవారం ప్రారంభం కావలసిన తొలి టెస్ట్ తొలి స్టేషన్ వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం కావలసి వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 16, 2024 1:01 pm

IND VS NZ

Follow us on

IND VS NZ Test Match : మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ – టీమిండియా తలపడనున్నాయి. ఇందులో భాగంగా తొలి టెస్ట్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఫలితంగా తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావం కర్ణాటకపై కూడా తీవ్రంగా ఉంది. గత కొద్దిరోజులుగా బెంగళూరు నగరవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఏకంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. దీంతో తొలి టెస్ట్ జరిగే బెంగళూరులో వర్షం అద్దంకిగా మారింది. ఇప్పటికే తొలి సెషన్ ఆట తుడిచిపెట్టుకుపోయింది. గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. బెంగళూరు మైదానంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో.. వర్షం ఏమాత్రం తెరిపినిచ్చినా మైదానాన్ని సిద్ధం చేస్తామని సిబ్బంది చెప్తున్నారు. ఇక ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో కాన్పూర్ లో జరిగిన రెండవ టెస్టుకూ వర్షం ఇలానే అంతరాయం కలిగించింది. దీంతో మూడు రోజులపాటు ఆట సాగలేదు (తొలి రోజు నిర్ణీత సమయాని కంటే ముందే నిలిపివేశారు) ఆ తర్వాత రెండు రోజులు మాత్రమే ఆట సాగగా.. భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చూపి.. మ్యాచ్ గెలిచారు.

వర్షం కురుస్తూనే ఉండడంతో..

బెంగళూరులో వర్షం కురుస్తూనే ఉండడంతో టాస్క్ వేయడం సాధ్యం కాలేదు. బుధవారం ఉదయం భారీగా వర్షం కురువగా.. మధ్యాహ్నం 11 తర్వాత వర్షం తగ్గింది. అయితే ఇప్పటికీ అక్కడ చినుకులు పడుతూనే ఉన్నాయి. ఒకవేళ వర్షం తగ్గితే మైదానాన్ని అప్పటికప్పుడు సిద్ధం చేయడానికి కనీసం గంట వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. ఆ తర్వాతే టాస్ వేయడానికి అవకాశం ఉంటుంది. టాస్ వేసిన అనంతరం మ్యాచ్ మొదలయ్యేందుకు 15 నుంచి 30 నిమిషాల వరకు సమయం పడుతుంది. ఈ ప్రకారం చూసుకుంటే తొలిరోజు మొదటి సెషన్ ఆట నిర్వహించడం సాధ్యం కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ” వర్షం కురుస్తూనే ఉంది. ఉదయం భారీగా వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయానికి చినుకులు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఇక్కడ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచాం. అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ఉండడం వల్ల వాన నీటిని బయటికి పంపడానికి వీలుంది. వర్షం కాస్త తెరిపి ఇస్తే మైదానాన్ని సిద్ధం చేస్తామని” బెంగళూరులోని చిన్నస్వామి గ్రౌండ్ పర్యవేక్షణ సిబ్బంది జాతీయ మీడియాతో చెబుతున్నారు.