Bhuma Akhila Priya: మామ నా కుర్చీని కదుపు.. భూమా అఖిల ప్రియ మాస్ వార్నింగ్ వైరల్

కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానిది ప్రత్యేక స్థానం. సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపారు భూమా నాగిరెడ్డి. ఆయనకు అండగా భార్య శోభా నాగిరెడ్డి నిలిచేవారు. అయితే ఆ కుటుంబంలో అడ్డగోలుగా చీలిక వచ్చింది. వారి రాజకీయ ప్రత్యర్థులుగా కూడా మారారు. ఈ తరుణంలో తాజాగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సొంత మేనమామపై కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

Written By: Dharma, Updated On : October 16, 2024 1:14 pm

Bhuma Akhila Priya

Follow us on

Bhuma Akhila Priya: కర్నూలు జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన సందర్భంగా ఉద్రిక్తతకు దారితీసింది. తన మామ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే అఖిల ప్రియకు మధ్య గట్టి ఫైట్ నడిచింది.నంద్యాలలో విజయ పాల డైరీ పరిశ్రమను అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు.సందర్భంగా కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై అఖిలప్రియ అభ్యంతరం వ్యక్తం చేశారు.మాజీ సీఎం జగన్ ఫోటోలను తొలగించి.. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫోటోలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జగన్ ఫోటోలను అలానే విడిచిపెట్టిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరీ కి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వచ్చారన్న విషయం తెలుసుకున్న చైర్మన్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆమెకు ఫోన్ చేశారు. ఆయన కుర్చీలో అఖిల ప్రియ కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కుర్చీలో ఎలా కూర్చుంటావ్ అంటూ అఖిలప్రియను నిలదీసినంత పని చేశారు.సిబ్బంది కూర్చోమంటేనే తాను కూర్చున్నానని అఖిల ప్రియ బదులిచ్చారు. తన అనుమతి లేకుండా తన సీటులో కూర్చునేందుకు నువ్వెవరు అంటూ ప్రశ్నించారు. దీనికి అఖిలప్రియ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. గతంలో మా కుర్చీలో మీరు కూర్చో లేదా అంటూ నిలదీశారు. బెదిరిస్తున్నావా.. నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దాం అంటూ అఖిలప్రియ సవాల్ చేశారు. ప్రస్తుతం వారి మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెలకొంది.

* కొద్దికాలంగా రాజకీయ వైరుధ్యం
విజయ డైరీ చైర్మన్ గా ఎస్.వి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన స్వయాన అఖిలప్రియ కు మేనమామ. తొలుత అఖిల ప్రియ వెంట మరో మేనమామ ఎస్ వి మోహన్ రెడ్డి ఉండేవారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అఖిలప్రియ వెంట నడిచేవారు. అయితే రాను రాను వారి మధ్య రాజకీయ విభేదాలు ఏర్పడ్డాయి. అఖిల ప్రియ టిడిపి గూటికి వచ్చారు. అయితే విజయ డైరీలో దివంగత ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించి పక్కన పడేశారు.ఈ విషయం తెలుసుకున్న అఖిల ప్రియ విజయ డైరీని సందర్శించారు. అక్కడ మాజీ సీఎం జగన్ ఫోటోలు ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డైరీ వద్ద పక్కన పెట్టిన శిలాఫలకాన్ని అఖిలప్రియ పాలాభిషేకం చేశారు.

* మామగా ఫోన్ చేశావా?
అయితే కార్యాలయంలో చైర్మన్ కుర్చీలో కూర్చున్న అఖిలప్రియ విజయ డైరీ తో మాట్లాడారు. ఆ సమయంలోనే తన మామ జగన్మోహన్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. అయితే మామగా ఫోన్ చేశావా? లేకుంటే విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేశావా? అంటూ భూమా అఖిలప్రియ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. తన మామగా ఫోన్ చేస్తే సరే కానీ.. చైర్మన్ గా ఫోన్ చేస్తే తనపై ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. ఎన్టీఆర్ శిలాఫలకం తొలగింపు పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు అఖిల ప్రియ. వైసీపీ నేతలు ఇంకా భ్రమలోనే బతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.వాటన్నింటినీ బయటకు తీస్తామని హెచ్చరించారు.