Odi World Cup 2023: ఇండియన్ టీమ్ ఇప్పుడు తన స్టామినా ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైనది. ఎందుకంటే 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఏ జట్టు మీద అయితే ఇండియన్ టీమ్ ఘోర పరాభావాన్ని మూటగట్టుకుందో ఇప్పుడు కూడా అదే జట్టు మీద తనదైన స్టామినాని చూపించి ఒక అద్భుతమైన విక్టరీ ని నమోదు చేయాల్సిన సమయం అయితే వచ్చింది. అవకాశం వచ్చినప్పుడే మన దమ్ము ఏంటో నిరూపించుకోవాలి అనే మాటను గుర్తు చేసుకుంటూ ఈసారి న్యూజిలాండ్ టీమ్ ని చిత్తు చేయడానికి ఇండియన్ టీం ఇవ్వాళ్ల మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడడానికి రెడీ అవుతుంది.
ఇక అందులో భాగంగానే ఇండియన్ టీం లో ఉండే ప్లేయింగ్ 11 మీద ఇప్పటికే కొంతమంది సీనియర్ ప్లేయర్లు పలు రకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్యా లేని లోటును తీర్చే ప్లేయర్ ఇండియన్ టీం కి దొరకడం లేదనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తూనే, బాల్ తో కూడా ప్రత్యర్థి ని ఇబ్బంది పెడుతు ఉండేవాడు.ఆయన ఆల్ రౌండర్ ప్లేయర్ అవ్వడం వల్ల అతని ప్లేస్ ని సూర్య కుమార్ యాదవ్ భర్తీ చేయలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన ఏం చేసినా బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు. ఇంకా బౌలర్ గా మరొక స్పిన్నర్ ని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. దానివల్ల సెమీ ఫైనల్ మ్యాచ్ లోకి అశ్విన్ వచ్చే అవకాశం ఉంది అని కొంతమంది సీనియర్లు అభిప్రాయ పడుతుంటే మరికొందరు మాత్రమే సూర్య కుమార్ యాదవ్ ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అలా అయితేనే బ్యాటింగ్ పరంగా ఇండియా స్ట్రాంగ్ అవుతుంది.
లేకపోతే మాత్రం బ్యాటింగ్ పరంగా టీం చాలా వీక్ అవుతుంది.
ఇక ఇలాంటి పొజిషన్ లో ఇండియన్ టీమ్ మొదట్లోనే రెండు, మూడు వికెట్లు కోల్పోతే ఇండియాని ఆదుకోవడానికి బ్యాట్స్ మెన్స్ ఎక్కువమంది ఉండరు, అందువల్ల ఇండియా ఎక్కువ స్కోర్ చేయడంలో తడబడుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూనే పలువురు సీనియర్ ప్లేయర్లు కూడా ఈ విషయం పైన స్పందిస్తూ సూర్య కుమార్ యాదవ్ ని టీంలో కంటిన్యూ చేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ టీమ్ దాన్ని ఎదుర్కోవాలంటే మన టీం లో కూడా బ్యాట్స్ మెన్స్ ఎక్కువమంది ఉంటే మంచిదని పలువురు సీనియర్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే రవి శాస్త్రి లాంటి సీనియర్ ప్లేయర్లు సైతం సూర్యకుమార్ యాదవ్ టీం లో ఉంటే టీం కి కొంతవరకు బ్యాటింగ్ పరంగా బలం అనేది ఏర్పడుతుంది. అంటూ ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇండియన్ ప్లేయింగ్ 11 లో సూర్య కుమార్ యాదవ్ ఉంటాడా లేదంటే మ్యాచ్ ఆడుతుంది వాంఖడే లో కాబట్టి స్పిన్ బౌలర్ తో ఆడించడం బెటర్ అని మరో స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ ని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది…