India vs England: యశస్వి డబుల్ సెంచరీ కొట్టాడు… ఇక ఏం జరగనుంది ?

అయితే జైశ్వాల్ పుణ్యమాని ఇండియన్ టీం భారీ స్కోర్ అయితే చేయగలిగింది. సీనియర్ ప్లేయర్లు అందరూ తడబడ్డ కూడా ఒక యంగ్ ప్లేయర్ అయిన జైశ్వాల్ నేను ఉన్నాను అంటూ టీమ్ బ్యాటింగ్ భారం మొత్తాన్ని మోస్తూ టీమ్ కి బలంగా మారడం అంటే మామూలు విషయం కాదు.

Written By: Gopi, Updated On : February 3, 2024 10:23 am
Follow us on

India vs England: ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా టీమ్ మొదట బ్యాటింగ్ తీసుకొని చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ ముందుకు సాగుతుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసిన ఇండియన్ టీమ్ మొదటి రోజే తమ సత్తా చాటుకుంది. ఇండియన్ ప్లేయర్లలో యశస్వి జైస్వాల్ చాలా చక్కటి ప్రదర్శినను కనబరుస్తూ అద్భుతమైన సెంచరీని సాధించడమే కాకుండా 179 పరుగుల వద్ద తొలిరోజు నాటౌట్ గా నిలిచాడు. ఇక రెండో రోజు ఆట ప్రారంభమైన వేళ ఈ రోజు కూడా తన సత్తాను చాటాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేసి జైశ్వాల్ చాలా ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. దంచి కొడుతూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ మరోవైపు వికెట్లు పడుతున్నాయి. అశ్విన్ ఔట్ కావడంతో కులదీప్ బ్యాటింగ్ కు వచ్చాడు.

అయితే జైశ్వాల్ పుణ్యమాని ఇండియన్ టీం భారీ స్కోర్ దిశగా సాగుతోంది. సీనియర్ ప్లేయర్లు అందరూ తడబడ్డ కూడా ఒక యంగ్ ప్లేయర్ అయిన జైశ్వాల్ నేను ఉన్నాను అంటూ టీమ్ బ్యాటింగ్ భారం మొత్తాన్ని మోస్తూ టీమ్ కి బలంగా మారడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ రోజు డబుల్ సెంచరీ చేసి స్కోర్ ని దాదాపు 500 పరుగుల వరకు తీసుకెళ్లగలిగితే ఇంగ్లాండ్ టీమ్ పతనం ప్రారంభమైనట్టే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చిన ఇంగ్లాండ్ ప్లేయర్లని మన బౌలర్లు ఈజీగా బోల్తా కొట్టించగలిగితే ఈ మ్యాచ్ మొత్తం మన చేతిల్లోకి వచ్చినట్టే…ఇప్పటికే మొదటి మ్యాచ్ లో ఘోరమైన ఓటమిని చవి చూసిన ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో సత్తా చాటకపోతే మాత్రం ఈ సిరీస్ ను కోల్పోతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

కాబట్టి రెండో రోజు చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఇండియన్ టీమ్ కి అయిన, అటు ఇంగ్లాండ్ టీమ్ కి అయిన ఈ ఒక్క రోజు చాలా కీలకం అనే చెప్పాలి. ఇవాళ్ళ ఏ టీమ్ అయితే పై చేయి సాధిస్తుందో వాళ్లే ఈ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. అందుకే ఈ ఒక్కరోజు గడిస్తే మ్యాచ్ ఎవరు విన్ అవుతారో తెలిసే అవకాశం కూడా ఉంది…