
ఇంగ్లండ్‌తో టీ 20 సిరీసుకు ముందు టీమ్ ఇండియాలో ముగ్గురు ఆటగాళ్లపై సందేహాలు నెలకొన్నాయి. యార్కర్ల వీరుడు నటరాజన్ జట్టుకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాతియా ఫిజికల్ టెస్టుల్లో విఫలమయ్యారని సమాచారం. మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
Also Read: వీడియో వైరల్: పాండ్యా, కేఎల్ రాహుల్ మెరుపులు.. కోహ్లీ, శాస్త్రి షాక్
మార్చి 12న సాయంత్రం 7 గంటలకు తొలి టీ20లో రెండు జట్లు తలపడతాయి. ఒకరోజు విరామంతోనే ఐదు టీ20లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టును ప్రకటించారు. మరికొన్ని నెలల్లోనే టీ20 ప్రపంచకప్ ఉండడంతో ఆటగాళ్లను పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇంతలోనే క్రికెటర్లు గాయాలు, ఫిట్‌నెస్ ఇబ్బందులతో దూరం కావడం కలవర పెడుతోంది.
మరోవైపు తమిళనాడు యువపేసర్ తంగరసు నటరాజన్ ఐపీఎల్ 2020లో అదరగొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా వెళ్లి మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. బలమైన యార్కర్లను విసురుతూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్ ఆడలేకపోయిన నట్టూ గాయం కారణంగా బెంగళూరులోని ఎన్‌సీఏలో ట్రైనింగ్ పొందుతున్నాడు. మార్చి 12 వరకు అతడు అందుబాటులో ఉండడని ఎన్‌సీఏ బృందం జట్టు యాజమాన్యానికి చెప్పింది.
కానీ.. అతడికి ఎలాంటి గాయమైంది..? తీవ్రత ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలతో బూమ్రా దూరమైన నేపథ్యంలో నటరాజన్ అవసరం కోహ్లీసేనకు ఎంతగానో అవసరం. మరోవైపు.. ఐపీఎల్, టీఎన్‌పీఎల్ లీగుల్లో అదరగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమిలో కోలుకుంటున్న అతడిని సెలక్టర్లు ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేశారు. బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన రన్నింగ్ రేస్‌లో అతను రెండుసార్లు అర్హత సాధించలేదని సమాచారం. ప్రమాణాలకు దీటుగా అతడి ఫిజిక్‌గా లేనట్లుగా తెలుస్తోంది. దాంతో అతను కూడా జట్టుకు దూరం కాక తప్పని పరిస్థితి.
Also Read: గోవాలో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాహం.. పెళ్లి కూతురు ఈమెనే?
అలాగే.. రాజస్థాన్ రాయల్స్‌కు గతేడాది అద్భుత విజయాలు అందించిన రాహుల్ తెవాతియాదీ పరిస్థితీ ఇలాగే ఉంది. రెండోసారి అతడికి ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించనున్నారు. టీమిండియాకు ఆడాలన్న అతడి కల సులభంగా నెరవేరేలా కనిపించడంలేదు. జట్టులో అతడికి ఎలాంటి పాత్ర ఇవ్వాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కాగా.. నెట్‌బౌలర్‌గా అహ్మదాబాద్‌లో ఉన్న రాహుల్ చాహర్‌ను చక్రవర్తి స్థానంలో ఎంపిక చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Comments are closed.