https://oktelugu.com/

India vs England 3rd test live score : ఇంగ్లండ్ లీడ్ 354, ఇండియా ఖేల్ ఖతమేనా?

భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు లో అద్భుతం జరిగితే తప్ప భారత్ గెలిచే అవకాశాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో భారత్ కుప్పకూలింది. భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే అదే సమయంలో ఇదే పిచ్ పై భారత బ్యాట్స్ మెన్ క్యూ కడితే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పట్టుదలగా ఆడారు. కెప్టెన్ జో రూట్ 121 పరుగులతో సెంచరీ చేసి చెలరేగాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2021 / 06:03 PM IST
    Follow us on

    భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు లో అద్భుతం జరిగితే తప్ప భారత్ గెలిచే అవకాశాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో భారత్ కుప్పకూలింది. భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే అదే సమయంలో ఇదే పిచ్ పై భారత బ్యాట్స్ మెన్ క్యూ కడితే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పట్టుదలగా ఆడారు. కెప్టెన్ జో రూట్ 121 పరుగులతో సెంచరీ చేసి చెలరేగాడు. అందరూ రాణించడంతో 432-10తో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. భారత్ పై ఏకంగా 354 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.

    ఈ ఉదయం ఇంగ్లండ్ ను త్వరగా ఔట్ చేసిన ఆనందం భారత్ కు ఎంతో సేపు నిలవలేదు. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత బ్యాట్స్ మెన్ ను ఇంగ్లండ్ బౌలర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. కేఎల్ రాహుల్ ను ఇప్పటికే ఔట్ చేశారు. 34 పరుగులకే 1 వికెట్ కోల్పోయి భారత్ లంచ్ కు వెళ్లింది.

    ఈ ఉదయం చిరు జల్లులు పడ్డాయి. ఇప్పుడు వర్షం పడుతోంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో అండర్సన్ లాంటి నాణ్యమైన బౌలర్లను కాచుకొని భారత్ నిలబడడం కష్టమేనని అంటున్నారు. పిచ్ ప్రమాదకరంగా మారుతుండడంతో టీమిండియా ఇప్పుడు 350కు పైగా పరుగులు చేయడంతోపాటు ఇంగ్లండ్ ముందు ఓ భారీ లక్ష్యం ఉంచాలి. అంటే కనీసం 600కు పైగా పరుగులు చేయాలి. అలా చేయాలంటే భారత్ బ్యాట్స్ మెన్ నిలవాలి. అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

    ఎందుకంటే ఇప్పటికే ఒక వికెట్ కోల్పోయింది. పూజారా, కోహ్లీ, రహానే, పంత్ లు అస్సలు ఫామ్ లో లేరు. దీంతో భారత్ ఓటమి తప్పాలంటే అద్భుతమే జరగాలి. ఆట ఇంకా మూడు రోజులు మిగిలి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫలితం తేలడం ఖాయం. మరి దీన్ని టీమిండియా ఎలా కాచుకుంటుందనేది చూడాలి.