https://oktelugu.com/

KTR: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం బిడ్డ – కేటీఆర్ హెచ్చరిక

KTR: చంద్రబాబు తొత్తు, బినామీ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓ బినామీని దిగుమతి చేసుకుందని వ్యంగ్యంగా మాట్లాడారు. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించాలా? అని ప్రశ్నించారు. ఆయనకు సరైన సమాధానం చెబుతామని చెప్పారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహారాష్ర్టలో సీఎంపై విమర్శలు చేసిన మంత్రిని […]

Written By: , Updated On : August 27, 2021 / 06:04 PM IST
Follow us on

KTRKTR: చంద్రబాబు తొత్తు, బినామీ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓ బినామీని దిగుమతి చేసుకుందని వ్యంగ్యంగా మాట్లాడారు. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించాలా? అని ప్రశ్నించారు. ఆయనకు సరైన సమాధానం చెబుతామని చెప్పారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహారాష్ర్టలో సీఎంపై విమర్శలు చేసిన మంత్రిని అరెస్టు చేశారని గుర్తు చేశారు.

మంత్రి మల్లారెడ్డికి(Malla Reddy) రేవంత్ రెడ్డి మాటలకు ఆవేశం వచ్చి ఆగలేక మాట్లాడారని సూచించారు. రేవంత్ రెడ్డికి తగిన శాస్తి జరుగుతుందని చెప్పారు. త్వరలో పాదయాత్ర చేసే బండి సంజయ్ ఎందుకు చేస్తున్నారో చెప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండో స్థానం కోసం పాకులాడుతున్నాయని ఎద్దేవా చేశారు. మేమంటే మేం రెండో స్థానంలో ఉన్నామని గొడవలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నామని తెలియజేసేందుకే పాదయాత్ర చేస్తున్నారా అని విమర్శించారు.

తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ జెండా పండగ నిర్వహించనున్నట్లు తెలిపారు. 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీల నియామకం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు అన్ని నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో 1400 బస్తీల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కమిటీల్లో 51 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిపారు.

రాష్ర్టంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో టీఆర్ఎస్ భవానానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు. తెలంగాణ భవన్ కంటే ఉన్నతంగా ఢిల్లీలో భవన్ ను నిర్మిస్తామన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సమష్టిగా పాటుపడాలని సూచించారు. బలమైన నాయకత్వంతోనే పార్టీ అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.