India vs England : నాలుగో టెస్ట్ కు ఇంగ్లండ్ కు కష్టాలివీ

మిగతా రెండు టెస్టుల్లో సత్తా చూపిస్తే కప్ దక్కించుకోవచ్చని ఇలాంటి మాజీ ఆటగాళ్లు జట్టుకు సూచిస్తున్నారు.. రెండు వరుస ఓటముల నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు తిరిగి పుంచుకోగలదా? అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది.

Written By: NARESH, Updated On : February 20, 2024 10:53 pm
Follow us on

India vs England : ఉప్పల్ లో గెలిచింది. విశాఖపట్నంలో ఓడింది. రాజ్ కోట్ లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదీ ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పరిస్థితి. ముఖ్యంగా రాజ్ కోట్ లో ఆ జట్టు ఎదుర్కొన్న ఓటమి పై ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అన్నివేళ్ళూ బెయిర్ స్టో వైపే చూపిస్తున్నాయి. టెస్ట్ సిరీస్ కు ముందు బజ్ బాల్ క్రికెట్ గురించి ఇంగ్లాండ్ జట్టు తెగ ప్రచారం చేసింది. ఆ బాల్ తోనే ఇంగ్లాండ్ జట్టు 21 టెస్టులో 14 విజయాలు సాధించింది. మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ ను పతాక స్థాయికి తీసుకెళ్లింది.. విశాఖపట్నంలో టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ గెలిస్తే దాన్ని గాలివాటం లాగా ఇంగ్లాండ్ జట్టు తీసుకుంది. రాజ్ కోట్ లో దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకున్నప్పటికీ.. బెయిర్ స్టో అంపైర్ నిర్ణయాలే మా ఓటమికి కారణమని కొత్త సాకును బయటపెట్టే ప్రయత్నం చేశారు. జట్టు కోచ్ బ్రెండన్ మెక్కులమ్ తో మ్యాచ్ రిఫరీ ని కలిశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

ఇంగ్లాండ్ కెప్టెన్ బ్యాటింగ్ లో రాణించడం లేదు. కొన్ని సార్లు అతడు డక్ ఔట్ అవుతుండడం ఇంగ్లాండ్ జట్టును నివ్వెర పరుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన టోర్నీలో రాణించిన జో రూట్ ఈ టోర్నీలో ఇప్పటివరకు చెప్పుకో తగిన స్థాయిలో స్కోర్ సాధించలేదు. పోప్, డక్కెట్ మినహా మిగతా వారెవరూ సెంచరీలు సాధించలేకపోయారు.. మొదటి టెస్టులో భారత బౌలర్లను ప్రతిఘటించిన పోప్.. ఆ తర్వాత ఆ స్థాయిలో ఇప్పటివరకు ఇన్నింగ్స్ ఆడలేదు.. మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన డక్కెట్ రెండవ ఇన్నింగ్స్ లో తేలిపోయాడు..

ఎవరో ఒకరు ఆడటం తప్ప.. ఈ సిరీస్లో జట్టు సమిష్టిగా ఆడిన సంకేతాలు లేవు. ఉప్పల్ టెస్టులో తప్ప.. మిగతా రెండు టెస్టుల్లో కనిపించడం లేదు. అందువల్లే బెయిర్ స్టో జట్టు కూర్పు పట్ల సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ” ఎవరో ఒకరు ఆడటం తప్ప.. మిగతా ఆటగాళ్లు ఆ బాధ్యత తీసుకోవడం లేదు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారిని కెప్టెన్ సరిగా వినియోగించుకోలేకపోతున్నాడు. ఇలాంటప్పుడు బజ్ బాల్ విధానం కేవలం ప్రచారానికి మాత్రమే పనికొస్తుందని” ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాళ్లు అంటున్నారు.. పరిస్థితి ఇలానే ఉంటే కెప్టెన్సీ మార్చాల్సిన అవసరం జట్టుకు ఏర్పడుతుందని వారు చెబుతున్నారు.

అయితే రెండు ఓటములు ఎదురైనంతమాత్రాన కెప్టెన్ ను మార్చాల్సిన అవసరం లేదని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కులమ్ అభిప్రాయపడుతున్నాడు. ” ఆట అన్నాకా ఓటములు సహజం. ఇలాంటప్పుడు కెప్టెన్ ను నిందించడం సరికాదు. అతడికి మా మద్దతు కొనసాగుతుందని” మెక్కులమ్ అభిప్రాయపడ్డాడు. మరో వైపు సీనియర్ బౌలర్ అండర్సన్ కు నాలుగో టెస్ట్ లో విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అండర్సన్ స్థానంలో రాబిన్ సన్ ను తీసుకొస్తారని ప్రచారం జరుగుతున్నది. మార్క్ వుడ్ స్థానం లో అట్కిన్సన్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అండర్సన్ రెండో టెస్టులో ఐదు వికెట్లు తీయగా.. మూడో టెస్ట్ లో ఒక వికెట్ మాత్రమే పడగొట్టడం విశేషం. ముడో టెస్ట్ లో 33 – 3 తో రాణించిన మార్క్ వుడ్.. తర్వాత ఆ స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. రెండవ ఇన్నింగ్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అతడి ఫిట్ నెస్ పై జట్టు ఇప్పటికీ ఆందోళన గానే ఉంది. అట్కిన్సన్ ఇంతవరకు టెస్ట్ క్రికెట్ ఆడ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంగ్లాండ్ జట్టులో ఎన్నో పరిశీలనలు జరుగుతున్నాయి. రెండు వరుస ఓటములతో ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికైనా ముంచుకుపోయింది ఏమీ లేదని.. మిగతా రెండు టెస్టుల్లో సత్తా చూపిస్తే కప్ దక్కించుకోవచ్చని ఇలాంటి మాజీ ఆటగాళ్లు జట్టుకు సూచిస్తున్నారు.. రెండు వరుస ఓటముల నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు తిరిగి పుంచుకోగలదా? అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది.