India vs England : రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించింది. 5 టెస్ట్ సిరీస్ లో భాగంగా 2 – 1 తో ముందంజ వేసింది. దీంతో రాంచీ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధిస్తుందని…సిరీస్ ను ఒడిసి పట్టుకుంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా రాంచి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ ఆటను దూరం పెట్టింది. ఫలితంగా 353 పరుగులు చేయగలిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ ఏకంగా 122 చేసి నాటౌట్ గా నిలిచాడు.
353 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయిన అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 4 పరుగులకే రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.. ఆ తర్వాత గిల్, యశస్వి జైస్వాల్ భారత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తలకు ఎత్తుకున్నారు. రెండో వికెట్ కు 86 పరుగులు జోడించారు. వ్యక్తిగత స్కోరు 38 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ అవుట్ అయ్యాడు. అప్పుడు భారత స్కోరు 86 పరుగులు. అప్పటినుంచి 177 వరకు భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. ఈ వికెట్లు కోల్పోయిందనేకంటే ఎంపైర్ నిర్ణయాల వల్లే భారత్ నష్టపోయింది అనడం సబబు.
గిల్(38), రజత్ పాటిదార్(17), అశ్విన్(1) ఎంపైర్ నిర్ణయాల వల్లే పెవిలియన్ చేరుకున్నారు. బషీర్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్ ను ఎంపైర్ ఎల్బీడబ్ల్యూ గా ప్రకటించాడు. ఈ క్రమంలో గిల్ మరో ఎండ్ లో ఉన్న జైస్వాల్ తో చర్చించి రివ్యూ కి వెళ్ళాడు. బంతి లెగ్ స్టంప్ కు తగులుతోందని డీఆర్ఎస్ లో కనిపించింది. దీంతో థర్డ్ ఎంపైర్ ఔట్ ఇచ్చాడు. రజత్, అశ్విన్ విషయంలోనూ ఇదే చోటుచేసుకుంది. భారత బ్యాటర్లు రివ్యూ కి వెళ్లినప్పటికీ సమీక్షను ఏం మాత్రం కోల్పోలేదు. ఫలితంగా అవుట్ అయ్యారు. గిల్, రజత్, అశ్విన్ లో ఎవరో ఒక్కరూ నాట్ అవుట్ గా ఉన్నా భారత్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ధోని ఇలాఖా లో భారత బ్యాటర్ల కు బ్యాడ్ టైం నడుస్తోంది. ప్రస్తుతం కీపర్ ధృవ్(30), కుల దీప్ యాదవ్(17) క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ బషీర్ నాలుగు వికెట్లు తీశాడు.