Musheer khan : అన్న టెస్టుల్లో అదరగొడుతుంటే.. తమ్ముడు రంజీల్లో “డబుల్” బాదాడు

మరోవైపు ముషీర్ ఖాన్ సోదరుడు సర్ఫ రాజ్ టెస్ట్ క్రికెట్ లో అదరగొడుతున్నాడు. రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అతడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి రెండు ఇన్నింగ్స్ ల్లో అర్థ శతకాలు చేసి అదరగొట్టాడు

Written By: NARESH, Updated On : February 24, 2024 8:53 pm
Follow us on

ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యా సోదరుల ద్వయం తర్వాత ఆ స్థాయిలో ఎవరు రాణిస్తారు అనే ప్రశ్నకు సర్ఫ రాజ్ సోదరుల రూపంలో జవాబు లభించింది. ఇటీవల ఇండియన్ టెస్ట్ క్రికెట్ జట్టులోకి సర్ఫ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో సర్ఫ రాజ్ ఆరంగేట్రం చేసి హాఫ్ సెంచరీల తో అదరగొట్టాడు. సర్ఫ రాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ కూడా దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియా తరఫున ఆడాడు. ఈ నేపథ్యంలో అన్నకు తగ్గ తమ్ముడి లాగా రంజీ ట్రోఫీలో ముషీర్ ఖాన్ అదరగొడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్ల మీద ఎదురు దాడికి దిగుతూ పరుగుల వరద పారిస్తున్నాడు.

ప్రస్తుతం రంజీ ట్రోఫీకి సంబంధించి విదర్భతో కర్ణాటక, ముంబాయి తో బరోడా, సౌరాష్ట్రతో తమిళనాడు, మధ్యప్రదేశ్ తో ఆంధ్ర ప్రదేశ్ తలపడుతున్నాయి. అయితే ముంబై జట్టు తరఫునుంచి ముషీర్ ఖాన్ బరిలోకి దిగాడు. రంజి ట్రోఫీలో వన్డే తరహాలో ఆట ఆడుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో శుక్రవారం తొలి సెంచరీ సాధించిన అతడు.. శనివారం దాన్ని డబుల్ సెంచరీగా మలిచాడు. మైదానంలో బరోడా జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ముంబై జట్టు 384 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ముంబై జట్టు సాధించిన పరుగుల్లో సగానికి పైగా ముషీర్ ఖాన్ కొట్టినవే కావడం విశేషం. వచ్చిన సహచరులు వచ్చినట్టే వెళ్ళి పోతున్నప్పటికీ ముషీర్ ఖాన్ ఏమాత్రం భయపడలేదు. 18 సంవత్సరాల అతడు వన్ మ్యాన్ షో చేశాడు అంటే అతిశయోక్తి కాదు. 18 ఫోర్ల సహాయంతో 357 బంతుల్లో 203 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు అంటే అతడు ఇన్నింగ్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ముంబై జట్టుకు చెందిన పృథ్వి షా (33), అజింక్య రహనే (3) నిరాశపరిచినప్పటికీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ కీపర్ హార్దిక్ (57) తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతడు మొండిగా ఆడటంతో ముంబై జట్టు నిలబడగలిగింది.

ముషీర్ ఖాన్ ఇప్పుడు మాత్రమే కాదు అండర్ 19 వరల్డ్ కప్ లోనూ సత్తా చాటాడు. భారత జట్టు తరఫున సెంచరీల మోత మోగించాడు. ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులు ముషీర్ ఖాన్ విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగి రంజీ ట్రోఫీలో అడుగుపెట్టి ఆకాశమే హద్దులాగా అదరగొడుతున్నాడు.. అయితే గత ఏడాది రంజీ సీజన్ కు సంబంధించి ముంబై జట్టు నుంచి ముషీర్ ఖాన్ ను తప్పించారు. తనను తప్పించడం వల్ల జట్టు ఎంతటి పొరపాటు చేసిందో డబుల్ సెంచరీ ద్వారా ముషీర్ ఖాన్ నిరూపించాడు.. వాస్తవానికి 2022 డిసెంబర్ లోనే ముషీర్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు మూడు మ్యాచ్ లలో 96 పరుగులు మాత్రమే చేశాడు. అప్పట్లో అతడికి విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి దూకుడుగా ఆడుతున్నాడు.

మరోవైపు ముషీర్ ఖాన్ సోదరుడు సర్ఫ రాజ్ టెస్ట్ క్రికెట్ లో అదరగొడుతున్నాడు. రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అతడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి రెండు ఇన్నింగ్స్ ల్లో అర్థ శతకాలు చేసి అదరగొట్టాడు